Bangarraju, Dj Tillu: సినిమాల విషయంలో ప్రేక్షకుల ఆలోచన ఇదేనా?

  • February 16, 2022 / 04:58 PM IST

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో బంగార్రాజు, డీజే టిల్లు సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అటు నిర్మాతలకు ఇటు డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాలు లాభాలను అందించడంతో పాటు ఈ సినిమాలలో నటించిన హీరోలకు సైతం ఈ సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అయితే ఆంధ్రాలో బంగార్రాజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే తెలంగాణలో డీజే టిల్లు కళ్లు చెదిరే కలెక్షన్లను సాధించింది. ప్రేక్షకులు నివశించే ప్రాంతాన్ని బట్టి సినిమాలను చూసే విషయంలో వాళ్ల ఆలోచన మారుతుందని ఈ రెండు సినిమాలు ప్రూవ్ చేశాయి.

Click Here To Watch

తెలుగు రాష్ట్రాల ప్రజల అభిరుచి గతంలో ఒకే విధంగా ఉన్నా ఈ మధ్య కాలంలో పరిస్థితి మారిందనే చెప్పాలి. బంగార్రాజు సినిమా గోదావరి భాష, యాసలో తెరకెక్కగా ఆంధ్ర, సీడెడ్ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణలో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. హైదరాబాద్ అర్బన్ స్లాంగ్ తో డీజే టిల్లు తెరకెక్కగా తెలంగాణలో ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంటే ఆంధ్రాలో మాత్రం ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.

యాస, కల్చర్ ను బట్టి కూడా సినిమాల ఫలితాలు మారుతున్నాయి. అదే సమయంలో రొటీన్ కథలతో తెరకెక్కుతున్న సినిమాలను ప్రేక్షకులు ఫ్లాప్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కి ఈ నెల 11వ తేదీన విడుదలైన ఖిలాడీ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. ఫుల్ రన్ లో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కనీసం 8 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చే అవకాశం అయితే ఉంటుందని చెపవచ్చు.

సంక్రాంతికి విడుదలైన సినిమాలలో బంగార్రాజు మినహా మరే సినిమా హిట్ కాకపోయినా బంగార్రాజు మాత్రం భారీగా కలెక్షన్లను సొంతం చేసుకోలేదు. మరోవైపు డీజే టిల్లు రిలీజ్ కాకపోతే ఖిలాడీ మెరుగైన కలెక్షన్లను సాధించి ఉండేదని రవితేజ ఫ్యాన్స్ భావిస్తున్నారు. క్రాక్ సక్సెస్ తర్వాత ఖిలాడీ రిజల్ట్ తో రవితేజకు మరోసారి నిరాశ ఎదురైంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus