ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమా అంటే.. టాక్ తో సంబందం లేకుండా కలెక్షన్లు వచ్చేవి. సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా… నిర్మాతలు,బయ్యర్లు సేఫ్ అయిపోయేవారు. అలా మినిమం గ్యారెంటీ హీరోగా .. ఏడాదికి 8 సినిమాల వరకూ చేసే వాడు మన అల్లరి నరేష్. అయితే కొన్నాళ్ళ నుండీ అతను ఒక్క హిట్ కొట్టడానికి కిందా మీదా పడుతున్నాడు. మహేష్ బాబు తో చేసిన మహర్షి.. అలాగే సునీల్ తో కలిసి నటించిన సిల్లీ ఫెలోస్ చిత్రాలు తప్ప.. అల్లరి నరేష్ సినిమాలు సరిగ్గా ఆడలేదు.
గత నెల విడుదలైన బంగారు బుల్లోడు సినిమా పరిస్థితి మరీ ఘోరం. ఈ చిత్రాన్ని 4కోట్లకు బయ్యర్లు కొనుగోలు చేస్తే .. కేవలం 2 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక ఈ చిత్రానికి బడ్జెట్ 6కోట్లు పెట్టగా … చాన్నాళ్ళ పాటు విడుదల చెయ్యకపోవడం వలన ఇంట్రెస్ట్ లతో కలుపుకుని నిర్మాతకి 11 కోట్లు అయ్యిందట. ఇందులో శాటిలైట్ రైట్స్ మరియు డబ్బింగ్ రైట్స్ రూపంలో రూ.3.70కోట్లు వచ్చాయట. ఇక ధియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.4కోట్లు రాగా..
మొత్తం కలుపుకుని రూ.7.70 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ రకంగా నిర్మాతకి రూ.3.30 కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రం కొన్న బయ్యర్లు రూ.2.1 కోట్ల వరకూ నష్టపోయినట్లు తెలుస్తుంది. మరి నాంది చిత్రంతో అయినా హిట్టు కొట్టి నరేష్ ఫాంలోకి వస్తాడేమో చూడాలి.
Most Recommended Video
జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?