Swathi Muthyam: గణేష్ బెల్లంకొండ ‘స్వాతిముత్యం’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

  • June 14, 2022 / 10:15 PM IST

టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన బెల్లంకొండ సురేష్.. ఇప్పటికే తన పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను హీరోగా నిలబెట్టిన సంగతి తెలిసిందే. తర్వాత తన చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ ను కూడా కూడా హీరోగా లాంచ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.’ప్రేమ ఇష్క్ కాదల్’ వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించిన టాలెంటెడ్ దర్శకుడు పవన్ సాధినేని గణేష్ డెబ్యూ మూవీని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.

అది 80 శాతం కూడా పూర్తయింది. కానీ ఎందుకో ఆ మూవీని పక్కన పెట్టారు. తర్వాత ‘సితార ఎంటర్టైన్మెంట్స్ లో చిత్రాన్ని మొదలుపెట్టాడు గణేష్. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’ అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్రంలో హీరోయిన్ కాగా లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఆగస్టు 13 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ప్రకటించారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని తెలుస్తుంది. గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ లతో పాటు సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్షవర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రం గణేష్ కు మంచి డెబ్యూ మూవీ గా నిలుస్తుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus