Bellamkonda Sreenivas: పెళ్లి పీటలు ఎక్కబోతున్న బెల్లంకొండ హీరో?
January 4, 2024 / 04:50 PM IST
|Follow Us
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎంతో మంది స్టార్ యంగ్ హీరోస్ అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే సీనియర్ హీరో హీరోయిన్ల పిల్లలు కూడా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. శర్వానంద్, వరుణ్ తేజ్, అభిరామ్ వంటి పలువురు హీరోలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మరి కొద్ది రోజులలో మరొక హీరో కూడా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో బెల్లంకొండ ఫ్యామిలీ ఒకటి. నిర్మాణ రంగంలో ఎంతో మంచి విజయమందుకున్నటువంటి ఈ కుటుంబం నుంచి హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి మనకు తెలుసు. ఇక ఈయన పలు సినిమాలలో హీరోగా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు.
ఇక టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ లేటెస్ట్ లో కూడా ఈయన తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి. ఇలా హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేకపోయినటువంటి సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారట. అయితే ఈయన ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
ఇలా గత కొంతకాలంగా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని ఈ విషయం పెద్దలకు తెలియజేయడంతో పెద్దలు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలోనే ఈయన తన పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన తెలియజేయబోతున్నట్లు సమాచారం మరియు సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.