‘అల్లుడు శీను’ సినిమా పక్కన పెడితే… మళ్ళీ ఓ చిన్న హిట్టందుకోవడానికి ఏకంగా ఐదేళ్ళు పట్టింది మన బెల్లంకొండ సాయి శ్రీనివాస కు..! ఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రంతో హిట్ అందుకుని మంచి ఫామ్లోకి వచ్చాడు బెల్లంబాబు. ‘సీత’ సినిమా ముందు వరకూ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు తన తండ్రి బెల్లంకొండ సురేషే డబ్బులు పెడుతూ వచ్చాడనేది ఓపెన్ సీక్రెట్.
కానీ శ్రీనివాస్ సినిమాలకు కు డిజిటల్ ప్లస్ హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 13 కోట్ల వరకూ వచ్చేస్తుంది. అందుకే అనిల్ సుంకర ముందుకొచ్చి ‘సీత’ చేసాడు. తరువాత అభిషేక్ పిక్చర్స్ మరియు మరో బయట నిర్మాత ‘రాక్షసుడు’ నిర్మించాడు. అందుకేనేమో ఇప్పుడు బెల్లంకొండ ఒక్కో సినిమాకి 8 – 10 డిమాండ్ చేస్తున్నాడట. ఈ మధ్య కథ చెప్పడానికి వచ్చిన దర్శక నిర్మాతలకి 10 కోట్లు ఇస్తే చేస్తానని చెప్పాడట. అలా కాదు 5-6 కోట్లు ఇస్తామని వారు చెప్పారట. దీంతో ఆలోచించి చెప్తాను అని బెల్లంకొండ శ్రీనివాస్ టైం అడిగాడట. ఇప్పటికీ ఈ విషయం పై డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయని సమాచారం.
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?