ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన బెనర్జీ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న విరాటపర్వం సినిమాలో కూడా బెనర్జీ కీలక పాత్రలో నటించారు. బెనర్జీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విరాటపర్వం మంచి సినిమా అని కొత్తవాళ్లతో మూడు సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో తన బాల్యం గడిచిందని బెజవాడలో సెకండరీ స్కూల్ సాగిందని చెప్పుకొచ్చారు. నాన్న సినిమా ఇండస్ట్రీలో ఉండటం వల్ల సినిమా రంగానికి చెందిన వాళ్లు పరిచయమయ్యారని బెనర్జీ కామెంట్లు చేశారు.
నాన్న ఆర్టిస్ట్ అని భరత్ అనే నేను మూవీలో నాన్న, నేను కలిసి నటించామని ఆయన తెలిపారు. గాయం, జైత్రయాత్ర, నువ్వు నేను సినిమాలు తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి బయోపిక్ తీస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని బెనర్జీ అన్నారు. చిరంజీవి మంచి మనిషి అని నటుడిగా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని బెనర్జీ అన్నారు. ఎవరైనా ఏమైనా అన్నా తిట్టినా చిరంజీవి పట్టించుకోరని బెనర్జీ చెప్పుకొచ్చారు.
చిరంజీవి కెరీర్ ను సినిమాగా తీస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పానే తప్ప నేను తీస్తానని చెప్పలేదని ఆయన తెలిపారు. చిరంజీవి మంచి హ్యూమన్ బీయింగ్ అని ఆయన చేసిన సేవలు కొన్ని మాత్రమే తెలుస్తాయని బెనర్జీ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన సేవలలో చాలా సేవలు ఎవరికీ తెలియవని బెనర్జీ కామెంట్లు చేశారు. కరోనా సమయంలో చిరంజీవి బయటివాళ్లకు చాలా సహాయాలు చేశారని బెనర్జీ చెప్పుకొచ్చారు.
నా వరకు సమానత్వం ఉండాలని అందరినీ గౌరవించాలని కోరుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా సాధ్యమైనంత వరకు సేవ చేసే అవకాశం లభించిందని ఆయన కామెంట్లు చేశారు. గతంతో పోల్చి చూస్తే ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు తేలికగా రావని కాకపోతే అవకాశాలు పెరిగాయని బెనర్జీ వెల్లడించారు.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!