ఆ భాగామతికి మాకూ ఎటువంటి సంబంధం లేదు : అనుష్క

  • May 11, 2016 / 12:14 PM IST

అనుష్క టైటిల్ పాత్రలో “పిల్ల జమీందార్” ఫేమ్ అశోక్ దర్శకత్వంలో “భాగమతి” అనే సినిమా గత నెలలో లాంఛనంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది.

అయితే.. సినిమా మొదలైనప్పట్నుంచి అందరూ “భాగమతి” చారిత్రక నేపధ్యంలో తెరకెక్కనున్న సినిమా అనుకొన్నారు. కానీ.. “భాగమతి” ప్రెజంట్ ట్రెండ్ సినిమా అని స్పష్టం చేసింది టైటిల్ పాత్ర పోషించనున్న అనుష్క.

హైద్రాబాద్ మహారాణి “బాగమతి”కి మా సినిమాకి ఎటువంటి సంబంధం లేదు, నేటితరం ఆధునిక యువతి కథగా మా “బాగమతి” తెరకెక్కనుందని అనుష్క తెలిపింది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus