పదిరోజుల్లో అమెరికా, ఆస్ట్రేలియాలో భరత్ అనే నేను కలక్షన్స్
May 2, 2018 / 07:04 AM IST
|Follow Us
సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే ఓవర్సీస్ లో మహేష్ సినిమాలు భారీ కలక్షన్స్ రాబడుతుంటాయి. ఆ విషయాన్నీ భరత్ అనే నేను మరోమారు స్పష్టం చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీని అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు మరో 43 దేశాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అన్ని చోట్ల భారీ వసూళ్లు రాబడుతోంది. అమెరికాలో ప్రీమియర్ షోలు, మొదటి రోజు కలక్షన్స్ రెండు మిలియన్లను దాటింది. అలాగే ఈ సినిమా 9 రోజుల్లోనే 3 మిలియన్ మార్కును దాటి ఔరా అనిపించింది.
అమెరికాలో 10 రోజులకు (ఏప్రిల్ 30 వరకు) ఈ సినిమా 3.19 మిలియన్ల (రూ. 21 కోట్లు) వసూలు చేసి మహేష్ కెరీర్లోనే హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాగే ఆస్ట్రేలియాలో 9 రోజులకుగాను 4.43 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను (2.23 కోట్లు) రాబట్టింది. పదిరోజుల తర్వాత కలెక్షన్లు తగ్గడం కామన్. కానీ కొత్త సినిమా రిలీజ్ వల్ల ఆ ప్రభావం భరత్ అనే నేనుపై పడకుండా ఉండాలని చిత్ర బృందం మంచి ప్లాన్ వేసింది. ఈ చిత్రానికి అదనంగా హోల్ ఫైట్ ని మరో రెండురోజుల్లో యాడ్ చేయనుంది. దీంతో కలక్షన్ల జోరు మరికొన్ని రోజులు కొనసాగడం గ్యారంటీ.