ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటనకు తెలుగు ప్రజలు జేజేలు పలికారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను మూడు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా రాబట్టి రికార్డ్ సృష్టించింది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోను భారీగా షేర్ సాధించింది. అంతేకాదు చెన్నై లోను భరత్ అనే నేను భారీ కలక్షన్స్ అందుకోవడం విశేషం. చెన్నై లో భరత్ అనే నేను మొదటి రోజు 27 లక్షలకు పైగానే రాబట్టి అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. అలాగే 23 రోజుల్లోనే బాహుబలి రికార్డ్ ని సైతం అధిగమించింది. బాహుబలి కంక్లూజన్ లాంగ్ రన్ లో కేవలం చెన్నైలో 1.65 కోట్లు వసూలు చేసి అప్పట్లో రికార్డ్ నెలకొల్పింది. దానిని 1.70 కోట్లతో భరత్ అనే నేను క్రాస్ చేసింది.
భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాని త్వరలోనే తమిళ భాషలో కూడ అనువాదం చేసి రిలీజ్ చేయనున్నారు. చెన్నైలో భారీ వసూళ్లు సాధించిన టాప్ టెన్ తెలుగు సినిమాలు…