సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో చేసిన భరత్ అనే నేను సినిమా ఈ నెల 20 న సినిమా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతందిస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉందో దుబాయ్ సెన్సార్ విభాగంలో పనిచేస్తున్న ప్రముఖ సినీ విశ్లేషకుడు అందించిన ఫస్ట్ రివ్యూ మీ కోసం…
కథబాగా చదువుకున్న ఓ యువకుడు రాజకీయంలోకి ప్రవేశిస్తే.. ముఖ్యమంత్రి అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ఏ రంగాల్లో మార్పు తెస్తారో అనేది చిత్ర కథ. అవినీతిని అడ్డుకునేందుకు.. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సీఎం భరత్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో అనేది ఆసక్తికరంగా డైరక్టర్ కొరటాల శివ మలిచారు.
పవర్ ఫుల్ మహేష్ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ ఇరగదీసారు. అంత తానై సినిమాని నడిపించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మహేష్ అందంగాడు, క్లాస్ అనే మాటలు కాకుండా పవర్ ఫుల్ కూడా అని చెబుతారు.
కైరా అద్వానీ కెమిస్ట్రీబాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీకి ఇందులో మంచి రోల్ ఇచ్చారు. ఆమె చాలా అందంగా కనిపించింది. ముఖ్యంగా మహేష్, కైరాల కెమిస్ట్రీ సూపర్.
సూపర్ డైరక్షన్కమర్షియల్ సినిమాల్లో సందేశాలను అద్భుతంగా మిక్స్ చేసే కొరటాల.. భరత్ అను నేను లో ప్రజలకు సందేశాన్ని ఇస్తూనే వినోదాన్ని పంచారు. ముఖ్యంగా మహేష్ ని చూపించిన విధానం అభిమానులకు విపరీతంగా నచ్చింది.
సినిమాటోగ్రఫీ కేకసూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్లు రవి కె. చంద్రన్, తిరు ఈ సినిమాని చాలా గ్రాండ్ గా చూపించారు. ప్రతి ఫ్రేమ్ కళ్ళకు విందు భోజనంలా అనిపించింది.
దేవి శ్రీ ప్రసాద్ గతంలో మహేష్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమాకి దేవీ మంచి ఆల్బమ్ ఇచ్చారు. మళ్ళీ అదే కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమాకి అంతకంటే మంచి ఆల్బం ఇచ్చారు. ఈ పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ తో మరిన్ని మార్కులు కొట్టేశారు. ఈ కథకు దేవీ ఇచ్చిన నేపథ్య సంగీతం పెద్ద బలమని చెప్పాలి.
చివరి మాటకొరటాల రాసిన డైలాగులు చప్పట్లు అందుకోవడమే కాదు.. ప్రతి ఒక్కర్ని ఆలోచనలో పడేశాయి. థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మనం కూడా సమాజం పట్ల బాధ్యతతో ఉండాలనే ఫీలింగ్ కలిగించాయి.
ఈ రివ్యూ ప్రముఖ సినీ క్రిటిక్ ట్వీట్ ని ఆధారం చేసుకొని రాసింది. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఫిల్మ్ ఫోకస్ రివ్యూ, రేటింగ్ రేపు రానుంది.