సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన భరత్ అనే నేను ఏప్రిల్ 20 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. మూడు వారాలకే 200 కోట్ల గ్రాస్ సొంతంచేసుకున్న ఈ సినిమా చెన్నైలోను మంచి కలక్షన్స్ అందుకుంది. 23 రోజుల్లోనే బాహుబలి రికార్డ్ ని సైతం అధిగమించింది. బాహుబలి కంక్లూజన్ లాంగ్ రన్ లో కేవలం చెన్నైలో 1.65 కోట్లు వసూలు చేసి అప్పట్లో రికార్డ్ నెలకొల్పింది.
దానిని 1.70 కోట్లతో భరత్ అనే నేను క్రాస్ చేసింది. ఈ కలక్షన్స్ చిత్ర బృందానికి ఉత్సాహాన్ని అందించింది. తమిళంలో డబ్ చేసిన సినిమాని ఈనెల 25 న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. మహేష్ బాబు కి తమిళనాడులోనూ అభిమానులు ఉన్నారు. ఆయన గత చిత్రాలు తమిళంలో అనువాదమై మంచి కలక్షన్స్ రాబట్టాయి. అంతేకాకుండా స్పైడర్ సినిమా ద్వారా నేరుగా మహేష్ అడుగుపెట్టారు. ఆ చిత్రం విజయం సాధించకపోయినప్పటికీ అక్కడి సినీ ప్రేక్షకులకు మహేష్ బాబు అంటే తెలుసు. అందుకే తెలుగులో ఘనవిజయం సాధించిన భరత్ అనే నేను సినిమా కూడా మంచి కలక్షన్స్ సాధిస్తుందని కొరటాల టీమ్ భావిస్తోంది. ప్రకటించిన తేదీన రిలీజ్ అయ్యేలా.. డబ్బింగ్, ప్రచార పనుల్లో వేగం పెంచింది.