యూట్యూబ్ లో భరత్ అనే నేను చిత్రం నుంచి తీసేసిన సన్నివేశాలు
May 5, 2018 / 06:57 AM IST
|Follow Us
కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రెండోసారి నటించిన సినిమా భరత్ అనే నేను. ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదలై కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేందుకు తెలుగు ప్రజలు ఆసక్తికనబరుస్తున్నారు. అయితే ఈ సినిమా నిడివి పెరిగిన కారణంగా షూటింగ్ చేసిన కొన్ని సన్నివేశాలను తొలిగించారు. ఆ సన్నివేశాలను చిత్ర బృందం అభిమానులకోసం యూట్యూబ్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అసెంబ్లీలో బడ్జెట్‌కు సంబంధించిన డిస్కషన్, రైతుతో మాట్లాడే సీన్, ప్రయివేట్ స్కూల్ యజమానిని చెంప పగలకొట్టే సన్నివేశంతో పాటు మరో సన్నివేశాన్ని విడుదలచేశారు.
వీటికి మ్యూజిక్ కూడా యాడ్ చేయలేదు. అయినా ఇవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి సినిమాలో ఉంటే ఇంకా బాగుండేవని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అందుకే ఈ నాలుగు వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా తొలివారానికే 161 గ్రాస్ రాబట్టి ఔరా అనిపించింది. రెండో వారానికి 200 కోట్ల గ్రాస్ అధిగమిస్తుందని అంచనావేస్తున్నారు. ఈ రెండు వారాల్లో రిలీజ్ అయిన సినిమాలు ఏది ఆకట్టుకోకపోవడంతో భరత్ అనే నేనుకి మరింత కలిసివస్తోంది.