Bheemla Nayak Collections: 9 రోజున భీమ్లా ఓకె అనిపించింది… కానీ..!

  • March 6, 2022 / 04:15 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించగా…. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంభాషణలు,స్క్రీన్ ప్లే ను అందించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఆంధ్రలో టికెట్ రేట్ల ఇష్యు నడుస్తున్నప్పటికీ ఈ చిత్రం తొలివారం భారీగా కలెక్ట్ చేసింది.అయితే 8 వ రోజున ఊహించని విధంగా డౌన్ అయ్యింది.9 వ రోజున కూడా జోరు చూపించలేకపోయింది. ఒకసారి 9 రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 30.45 cr
సీడెడ్  9.99 cr
ఉత్తరాంధ్ర  6.94 cr
ఈస్ట్  5.15 cr
వెస్ట్  4.80 cr
గుంటూరు  4.93 cr
కృష్ణా  3.41 cr
నెల్లూరు  2.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 68.02 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  7.20 cr
ఓవర్సీస్ 11.72 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 86.76 cr

‘భీమ్లా నాయక్’ చిత్రానికి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.9 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.86.76 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.23.24 కోట్ల షేర్ ను రాబట్టాలి. 9 వ రోజున కూడా ఈ చిత్రం రూ.0.90 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. కానీ భీమ్లా బ్రేక్ ఈవెన్ అవ్వడం సాధ్యమయ్యేలా లేదు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus