అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ రానా ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, కథనం అందిస్తున్నారు. మలయాళ సినిమా నిడివి 175 నిమిషాలు ఉండగా తెలుగు వెర్షన్ రన్ టైమ్ విషయంలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా నిడివి 150 నిమిషాలు ఉండనుందని సమాచారం. సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేశారని సమాచారం. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో పవన్ పాత్రకు రానా పాత్రతో పోలిస్తే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. పవన్ పాత్ర పేరునే ఈ సినిమాకు టైటిల్ గా పెట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మలయాళంలో అయ్యప్పనుమ్ కోషియమ్ మల్టీస్టారర్ కాగా తెలుగులో మాత్రం ఈ సినిమా సింగిల్ హీరో మూవీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లలో నిజం ఉందో లేదో తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే. మరోవైపు భీమ్లా నాయక్ నైజాం హక్కులు 40 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ ఎంట్రీతో భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని సమాచారం.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!