Bheemla Nayak: రూ.35 కి అక్కడ షోలు వేయలేరట.. దారుణమైన పరిస్థితి ఇది..!
February 25, 2022 / 04:15 PM IST
|Follow Us
‘అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్థం’ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది ‘భీమ్లా నాయక్’ చిత్రం. సరిగ్గా ఈ చిత్రం రిలీజ్ విషయంలో కూడా ఇదే థీమ్ సూట్ అవుతుందని చెప్పొచ్చు. అహంకారంతో ఏపి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేపట్టి.. ‘భీమ్లా నాయక్’ ప్రదర్శిస్తున్న థియేటర్ల పై పంజా విసురుతుంది. హైకోర్టు కొట్టేసిన జీవో నెంబర్ 35ని అక్రమంగా అమల్లోకి తెచ్చి.. పవన్ కళ్యాణ్ సినిమా పై కక్ష్య సాధింపు చర్యలు చేపట్టి.. డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు చూపెడుతుంది.
ఒక్క పవన్ కళ్యాణ్ కోసమనే కాదు.. ఈ సినిమాలో మరో హీరోగా రానా కూడా నటించాడు. అతని తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు కూడా వైజాగ్లో స్టూడియో కోసమని ఉంచిన స్థలాన్ని జగన్ కు ఇవ్వలేదని కూడా తన కొడుకు సినిమా పై ఇలా కక్ష్య సాధిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే… ఆంధ్రాలో చాలా చోట్ల తక్కువ రేట్లకి థియేటర్లను నడపడం కష్టమని భావించి ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రదర్శనలను నిలిపి వేయడం అందరినీ విషాదంలోకి నెట్టింది.
ముఖ్యంగా కృష్ణా జిల్లాల్లోని పలు థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ప్రదర్శించలేమని థియేటర్ యాజమాన్యం చేతులెత్తేసింది. అంతకన్నా థియేటర్ కొన్ని రోజులు మూసివేయడమే బెటర్ అని డిసైడ్ అయ్యింది. విస్సనపేటలో కూడా ఇదే పరిస్థితి. అభిమానులు షోలు వేయాలని రాస్తారోకోలు చేపట్టినా.. థియేటర్ యాజమాన్యం తగ్గలేదు. నిజంగా ఇది చాలా దారుణమైన పరిస్థితి. అయితే ‘భీమ్లా నాయక్’ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.