పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా ‘భీమ్లా నాయక్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు,రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆల్రెడీ విడుదల చేసిన ‘భీమ్లా నాయక్’ గ్లిమ్ప్స్ ఎటువంటి సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ ను ‘పవర్ ఆంథమ్’ గా విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఆడా గాడు ఈడా గాదు’ అంటూ సాగే ఈ పాటకి తమన్ అందించిన మాస్ బీట్ బాగుంది. ‘వకీల్ సాబ్’ కు మించిన జోష్ తో తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించినట్టు గ్లిమ్ప్స్ తోనే కాకుండా ఈ పాటతో మరోసారి ప్రూవ్ చేసాడు తమన్.పవన్ కళ్యాణ్ సినిమాల్లో మొదటి పాటకి ఉండే ఫైర్, ఇంటెన్సిటీ ఈ పాటలో కూడా ఉన్నాయి.
‘ఇరగ దీసే ఈడి ఫైరు సల్లగుండ.. ఖాకీ డ్రెస్సు పక్కనెడితే ఈడే పెద్ద గుండా.. నిమ్మళంగ కనబడే నిప్పు కొండ’ ‘భీం భీం భీం భీం భీమ్లానాయక్… దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవక్’.. అంటూ వచ్చే లిరిక్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించడం ఖాయమనే చెప్పాలి.గేయ రచయిత రామజోగయ్య శాస్త్రికి భారీగా ప్రశంసలు దక్కడం ఖాయం.మొత్తానికి ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇక పవన్ సరసన నిత్యా మేనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ లు.. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 2022 జనవరి 12 న సంక్రాంతి కానుకగా ‘భీమ్లా నాయక్’ విడుదల కాబోతుంది.
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!