యూత్ స్టార్ నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని మంచి వసూళ్లు సాధిస్తుంది. వరుస ప్లాప్ లతో సతమతమవుతోన్న నితిన్ ఈ చిత్రంతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక మొదటి వారమే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం .. రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుందనే చెప్పాలి.
ఇక ఈ చిత్రం 10 డేస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 8.57 cr |
సీడెడ్ | 3.13 cr |
ఉత్తరాంధ్ర | 2.86 cr |
ఈస్ట్ | 1.64 cr |
వెస్ట్ | 1.21 cr |
కృష్ణా | 1.44 cr |
గుంటూరు | 1.73 cr |
నెల్లూరు | 0.72 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.88 cr |
ఓవర్సీస్ | 3.10 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 26.28 cr |
‘భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 26.28 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. మరో పక్క ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం అదరకొడుతుంది. అక్కడ ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల దిశగా అడుగులు వేస్తుంది. ఫిబ్రవరి వంటి డ్రై సీజన్లో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను సాధించి హిట్ గా నిలవడం విశేషమనే చెప్పాలి. మరి ఫుల్ రన్ ముగిసేసరికి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..!
Click Here To Read Bheeshma Movie Review
Most Recommended Video
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!