‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి డిజాస్టర్ల తర్వాత నితిన్ నుండీ వచ్చిన చిత్రం ‘భీష్మ’. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలైంది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మొదటి వారం పూర్తయ్యేసరికే బ్రేక్ ఈవెన్ సాధించింది. వరుసగా 3 ప్లాప్ లతో సతమతమవుతోన్న నితిన్ ఈ చిత్రంతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. అయితే ఈ చిత్రం ఓపెనింగ్స్ ను చూసి కచ్చితంగా.. నితిన్ కెరీర్ బెస్ట్ అయిన ‘అఆ’ కలెక్షన్లను అధిగమిస్తుంది అని అంతా భావించారు. కానీ డ్రై సీజన్ కావడం అందులోనూ… కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల అంతగా రాణించలేకపోయిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి :
ఇక ఈ చిత్రం 20 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
9.27 cr
సీడెడ్
3.34 cr
ఉత్తరాంధ్ర
3.19 cr
ఈస్ట్
1.78 cr
వెస్ట్
1.33 cr
కృష్ణా
1.62 cr
గుంటూరు
1.89 cr
నెల్లూరు
0.83 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.95 cr
ఓవర్సీస్
3.32 cr
వరల్డ్ వైడ్ టోటల్
28.52 cr
‘భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 28.52 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. అయితే ఫిబ్రవరి బ్లాక్ బస్టర్ అయిన ‘మిర్చి’ కలెక్షన్లను మాత్రం అధిగమించలేకపోయింది. ఓవర్సీస్ లో కూడా 1 మిలియన్ దాటలేకపోయింది ఈ చిత్రం.