Bhoothaddam Bhaskar Narayana Review in Telugu: భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
March 1, 2024 / 09:24 AM IST
|Follow Us
Cast & Crew
శివ కందుకూరి (Hero)
రాశి సింగ్ (Heroine)
దేవి ప్రసాద్, షఫీ, సురభి సంతోష్, దేవి ప్రసాద్, వెంకటేష్ కకుమను తదితరులు. (Cast)
పురుషోత్తమ్ రాజ్ (Director)
స్నేహాల్ జంగాల, శశిధర్ కాశి (Producer)
శ్రీచరణ్ పాకాల (Music)
గౌతమ్ జి (Cinematography)
‘చూసి చూడంగానే’ ‘గమనం’ ‘మనుచరిత్ర’ వంటి చిత్రాలతో అలరించిన శివ కందుకూరి హీరోగా రూపొందిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. ఇదొక మైథాలజీ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని టీజర్, ట్రైలర్స్ తో పాటు ఓ శివుడి పాటతో మేకర్స్ చెప్పకనే చెప్పారు. అలాగే ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ వీడియో కూడా ఇంటర్నెట్ ను షేక్ చేసింది అని చెప్పాలి. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరించిందో తెలుసుకుందాం రండి :
కథ: భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) చిన్నప్పటి నుండి డిటెక్టివ్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. అందుకు అతని సోదరుడు ఒక కారణం అయితే… భాస్కర్ పెద్దయ్యాక వరుసగా జరుగుతున్న సీరియల్ మర్డర్స్ మరో కారణం అని చెప్పాలి.ముఖ్యంగా ఆడవాళ్ళని తలలు నరికేసి ఆ స్థానంలో దిష్టిబొమ్మ పెడుతూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తూ ఉండటం అనేది భాస్కర్ నారాయణని డిటెక్టివ్ అవ్వాలనే ఆలోచన వైపు నడిపిస్తాయి.
ఈ కేసును దర్యాప్తు చేసే క్రమంలో అతనికి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. మరోపక్క జర్నలిస్ట్ లక్ష్మీ(రాశి సింగ్) తో అతని లవ్ ట్రాక్ కూడా నడుస్తుంటుంది. అయితే ఆ సైకో కిల్లర్ వల్ల వీళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి? భాస్కర్ నారాయణ చివరికి ఈ మిస్టరీని ఛేదించాడా లేదా? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : శివ కందుకూరి మొదటి సినిమా నుండి ప్రామిసింగ్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. సినిమా సినిమాకి అతను నటుడిగా ఇంప్రూవ్ అవుతున్నాడు. భాస్కర్ నారాయణ పాత్రని అతను చాలా కూల్ అండ్ కంపోజ్డ్ గా హ్యాండిల్ చేశాడు. లుక్స్ పరంగా కూడా చాలా స్టైలిష్ గా కనిపించాడు ఈ కుర్ర హీరో. ఇక రాశి సింగ్ కూడా లక్ష్మీ పాత్రలో బాగా నటించింది.
ఆమె లుక్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. ఇక దేవి ప్రసాద్, వెంకటేష్ కకుమను..లు కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సురభి సంతోష్ కూడా పర్వాలేదు అనిపించింది. సీనియర్ నటుడు షఫీ కూడా తన మార్కు నటనతో అలరించాడు.
సాంకేతిక నిపుణుల పనితీరు: ఇప్పటికీ వరకు మనం ఎన్నో డిటెక్టివ్ సినిమాలు చూశాం. చిరంజీవి ‘చంటబ్బాయ్’, మోహన్ బాబు ‘డిటెక్టివ్ నారద’, నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి చిత్రాలను మనం చూశాం. వాటన్నిటిలో హీరో అనాథగా ఉంటాడు. ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ లో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు దర్శకుడు పురుషోత్తమ్ రాజ్. అతనికి ఓ ఫ్యామిలీ పెట్టడం. హీరో డిటెక్టివ్ కావాలనుకోవడానికి అతని సోదరుడు ట్రాక్ కూడా ఉన్నట్టు కన్విన్సింగ్ గా కథని మొదలుపెట్టాడు. అలాగే మైథాలజీ టచ్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో సీరియల్ కిల్లింగ్ ఎపిసోడ్స్ వచ్చే వరకు రొటీన్ గా సాగుతున్నట్టు అనిపించినా ఆ తర్వాత కథనం గ్రిప్పింగ్ గా మారుతుంది.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి దర్శకుడు.. ప్రేక్షకులు కుర్చీలో నుండి కథలకుండా చేశాడు అని చెప్పాలి. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు అని చెప్పాలి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడుకున్న సినిమాలకి ఇతనే సరైన ఛాయిస్ అని మరోసారి ప్రూవ్ చేశాడు. శివుడి పాట కూడా గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది.గౌతమ్ జి, చందు ఆది అండ్ టీం అందించిన విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయి. నిర్మాతలు స్నేహాల్ జంగాల, శశిధర్ కాశి..లు దీనిని చిన్న సినిమాలా ట్రీట్ చేయకుండా, ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు అని ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.
విశ్లేషణ: డిటెక్టివ్ కాన్సెప్ట్ సినిమాలు ఇష్టపడేవారికి అలాగే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ తప్పకుండా అలరిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కి బాగా కనెక్ట్ అవుతారు అని చెప్పొచ్చు. ఈ వీకెండ్ కి ఒకసారి హ్యాపీగా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా.!
రేటింగ్: 2.75 /5
Rating
2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus