మంచు మనోజ్… భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి ఇష్టం లేదు.అందుకే ఆయన వీరి పెళ్ళికి రాను అని చెప్పినట్టు కథనాలు వినిపించాయి. అలాగే మనోజ్ కు ఆస్తిలో రావాల్సిన వాటా ఇచ్చేసి చాలా కాలం క్రితమే అతన్ని బయటకు పంపేసినట్టు కూడా చాలా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే నిన్న అంటే మార్చి 3న శుక్రవారం నాడు రాత్రి 8:30 గంటలకు ఫిలింనగర్లోని మంచు లక్ష్మి నివాసంలో జరిగిన మంచు మనోజ్ పెళ్లికి మోహన్ బాబు హాజరయ్యారు.
‘పెద్ద వాళ్ళు ఎంత కోపగించినా.. అది పిల్లల సంతోషకరమైన జీవితం కోసమే.. పిల్లలు సంతోషంగా ఉంటామంటే పంతాలు పట్టింపులతో సంబంధం ఏముంది అని చాటి చెబుతూ’ మోహన్ బాబు.. తన చిన్న కుమారుడి పెళ్ళికి వచ్చి .. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో పెళ్లికూతురైన మౌనిక.. కన్నీటి పర్యంతమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మోహన్ బాబు తన చిన్న కోడలిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు.
ఓ రకంగా ఆమెను మాత్రమే కాకుండా ఈ ఫోటో అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది అని చెప్పాలి. మనోజ్ గతంలో అంటే 2015 లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.అది కూడా ప్రేమ వివాహమే. కొంతకాలం బాగానే కలిసున్నప్పటికీ.. తర్వాత అభిప్రాయబేధాలు తలెత్తడంతో 2019 లో విడాకులు తీసుకున్నారు. మనోజ్ అయిష్టంగానే విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో అతను డిప్రెషన్ కు లోనయ్యాడు.
కొన్నాళ్ల తర్వాత తన స్నేహితురాలు అయిన భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు కూడా ఇది వరకే పెళ్ళై విడాకులు తీసుకోవడం జరిగింది. అందుకే వీరి పెళ్ళికి మోహన్ బాబు అంగీకరించలేదు అంటూ ప్రచారం జరిగింది. మంచు లక్ష్మీ మోహన్ బాబును ఒప్పించడంతో వీరి పెళ్లి జరిగినట్టు స్పష్టమవుతుంది. సింపుల్ గా అనుకున్నప్పటికీ మనోజ్ రెండో పెళ్లి ఘనంగానే జరిగిందని చెప్పాలి.