Bhumika Chawla: స్నేహతులతో కలిసి భూమిక మందుపార్టి!

  • August 11, 2021 / 02:04 PM IST

సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఖుషి, ఒక్కడు అంటూ అప్పట్లో బాక్సాఫీస్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించే తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంది. పెద్దగా గ్లామర్ డోస్ పెంచకుండా గుడ్ లుక్స్ తోనే కుర్రాళ్ళను ఎట్రాక్ట్ చేసేది. ఖుషి నడుము సిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక చాలా ఏళ్ళ అనంతరం హీరోయిన్ గా సినిమా అవకాశాలు బాగా తగ్గడంతో అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

అక్క, వదిన వంటి సపోర్టింగ్ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆమెకు అవకాశాలు తక్కువగా వస్తున్నప్పటికీ ప్రేక్షకులకు పెద్దగా దూరంగా ఉండటం లేదు. సోషల్ మీడియాలో తన పర్సనల్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. అలాగే తన సినిమాలకు సంబంధించిన జ్ఞాపకాలను కూడా షేర్ చేసుకుంటోంది. ఇక ఇటీవల ఈ స్టార్ బ్యూటీ మందు గ్లాసుతో దర్శనమివ్వడం వైరల్ గా మారింది.

చాలా రోజుల తర్వాత స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి పార్టీని చేసుకుంటున్నట్లు ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటో ఇంటర్నెట్ ప్రపంచంలో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. లాక్ డౌన్ కారణంగా తన స్నేహితులకు బంధువులకు చాలా దూరంగా ఉన్న భూమిక ఇటీవల ప్రత్యేకంగా ఇలా కలుసుకొని పార్టీలు చేసుకుంటున్నట్లు సమాచారం.

1

2

3

4

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus