భూమిక ఆశలన్నీ ఆ సినిమా పైనే..!

  • December 17, 2019 / 01:29 PM IST

హీరోయిన్ గా తొలినాళ్ళలోనే స్టార్ హీరోల సరసన నటించేసింది భూమిక. పవన్ కళ్యాణ్ తో ‘ఖుషి’, మహేష్ బాబు తో ‘ఒక్కడు’, ఎన్టీఆర్ తో ‘సింహాద్రి’ వంటి బ్లాక్ బస్టర్స్ తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపొయింది. అలా ఈమె హవా కొంతకాలం సాగింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత నిర్మాతగా కూడా మారి ‘తకిట తకిట’ అనే సినిమా రూపొందించినప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.

ఇక కొంచెం గ్యాప్ తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాలని ‘ఎం.ఎస్.ధోని’ చిత్రం తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఆ చిత్రం మంచి హిట్ అయినప్పటికీ భూమికకు పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదనే చెప్పాలి. ఇక తెలుగులో నాని ‘ఎం.సి.ఏ’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఓ విధంగా కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయినప్పటికీ ఈమె బిజీ కాలేకపోయింది. తరువాత నాగ చైతన్య ‘సవ్య సాచి’ సినిమాలో చేసినా.. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు బాలయ్య ‘రూలర్’ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో కూడా భూమిక పాత్ర చాలా కీలకమట. సెకండ్ హాఫ్ లో కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుందట. మరి ఈ సినిమాతో అయినా బ్రేక్ వస్తుందో లేదో చూడాలి..!

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus