దేవుడా.. పెద్ద సినిమాల రీ రిలీజ్ ఖర్చు ఏకంగా అన్ని రూ.కోట్లా?

  • August 21, 2023 / 09:24 AM IST

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ కావడంతో పాటు అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తున్నాయి. ప్రేక్షకులు సైతం చిన్న సినిమాల కంటే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ లో థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లో అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తూ నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తాయి.

శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ రీ రిలీజ్ రైట్స్ కోసం మేకర్స్ 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుండగా ఏ మాయ చేశావే సినిమా రీ రిలీజ్ రైట్స్ కోసం కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి పెద్ద సినిమాల రీ రిలీజ్ ఖర్చు ఏకంగా అన్ని రూ.కోట్లా అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి సమయానికి 12 సినిమాలు రీ రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.

మరికొన్ని క్లాసిక్ సినిమాల రీ రిలీజ్ దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. పెద్ద సినిమాలను రీ రిలీజ్ చేయడం వల్ల థియేటర్లు సైతం కళకళలాడుతున్నాయి. పెద్ద సినిమాలు రీ రిలీజ్ లో మంచి లాభాలను అందిస్తుండటంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సైతం సంతోషంగా ఉన్నారు. అయితే పెద్ద సినిమాల రీ రిలీజ్ ల వల్ల చిన్న సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పెద్ద సినిమాలు రీ రిలీజ్ లో సైతం భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు హీరోలు సైతం సంతోషిస్తున్నారు. స్టార్ హీరోల క్లాసిక్ సినిమాలు ఏకంగా 8 నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్ లో గ్రాస్ కలెక్షనను సాధిస్తున్నాయి. అయితే ఫ్లాప్ సినిమాలను మాత్రం రీ రిలీజ్ చేయొద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus