Mahesh: త్రివిక్రమ్ అనగానే ఆమెని ఫిక్స్ చేస్తారా..?

  • May 3, 2021 / 06:12 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన వెంటనే ఇదిగో హీరోయిన్ అంటూ వార్తలు రావడం కామన్. అలాంటిది పెద్ద సినిమా, క్రేజీ కాంబినేషన్ అంటే ఊహాగానాలు ఓ రేంజ్ లో వినిపిస్తుంటాయి. రీసెంట్ గా మహేష్-త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మొదలవ్వడానికి మరో నాలుగైదు నెలల సమయం పడుతుంది. కానీ మంచి ముహూర్తం కోసం ఇన్నాళ్లు ఆగి ప్రకటన చేశారు. లేదంటే ఎన్టీఆర్-కొరటాల ప్రకటన వచ్చినప్పుడే మహేష్-త్రివిక్రమ్ సినిమా కూడా ప్రకటించాల్సి ఉంది.

ఈ సినిమా షూటింగ్ మొదలు కావాలంటే ముందుగా.. మహేష్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ ఓ కొలిక్కి రావాలి. త్రివిక్రమ్ తన వన్ లైన్ కథను స్క్రిప్ట్ గా మలచాలి. అన్నింటికీ మించి నటీనటుల డేట్స్ అందుబాటులో ఉండేలా చూడాలి. అప్పటికి మహేష్ బాబు పక్కన హీరోయిన్ ఎవరనేది తేలుతుంది. కానీ ఇప్పటికే పూజాహెగ్డే హీరోయిన్ అంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. నిజానికి త్రివిక్రమ్ కు పూజాహెగ్డే ఎప్పుడూ ఓ ఆప్షన్ గానే ఉంటుంది. ఆయన అడిగినప్పుడు డేట్స్ ఇవ్వడానికి అమ్మడు సిద్ధంగా ఉంటుంది.

కానీ ఈసారి వేరే హీరోయిన్ల మీద కూడా దృష్టి ఉంది. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా అనుకున్నప్పుడు హీరోయిన్ గా కియారాను తీసుకోవాలనుకున్నారు. మరి ఇప్పుడు మహేష్ కోసం త్రివిక్రమ్ ఆమెని అడుగుతారా..? లేక వేరే వాళ్లను తీసుకుంటారో చూడాలి. ఇక చాలా రోజులుగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను తెలుగులో పరిచయం చేయాలని హారిక హాసిని నిర్మాణ సంస్థ భావిస్తోంది. సో.. ఈసారి ఆమెని కూడా కన్సిడర్ చేయొచ్చు. అలానే లిస్ట్ లో మరికొన్ని పేర్లు ఉన్నాయని సమాచారం. మరి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus