దక్షిణాది అగ్ర దర్శకుల్లో శంకర్ ఒకరు. భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ హిట్టు మీద హిట్టు అందుకుంటున్నాడు ఈ దర్శకుడు. రీసెంట్ గా శంకర్ రెండు సినిమాలను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. హీరో రామ్ చరణ్ తో ఓ సినిమా అలానే.. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే రణవీర్ సింగ్ తో చేయబోయే కాన్సెప్ట్ ‘అపరిచితుడు’ రీమేక్ అని వెల్లడించారు. పదిహేనేళ్ల క్రితం వచ్చిన ‘అపరిచితుడు’ కథలో మెయిన్ పాయింట్ తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు.
దీంతో ‘అపరిచితుడు’ చిత్రనిర్మాత ఆస్కార్ రవిచంద్రన్.. దర్శకుడు శంకర్ కు లీగల్ నోటీసులతో పాటు ఓపెన్ లెటర్ పంపించినట్లు తెలుస్తోంది. తన అనుమతి లేకుండా శంకర్ సినిమాను రీమేక్ చేస్తుండడంతో రవిచంద్రన్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తను నిర్మించిన ‘అపరిచితుడు’ సినిమాలో మెయిన్ ప్లాట్ తీసుకొని దాన్ని హిందీలో శంకర్ తెరకెక్కిస్తున్నాడని తెలిసి షాక్ అయ్యానని రవిచంద్రన్ లేఖలో పేర్కొన్నారు.
‘అపరిచితుడు’ సినిమాకి సంబంధించిన స్టోరీ హక్కులను.. రైటర్ సుజాత దగ్గర ఫుల్ పేమెంట్ చెల్లించి దక్కించుకున్నానని.. కాబట్టి కథ మీద హక్కులు తనకే ఉన్నాయని.. అలాంటిది తన అంగీకారం లేకుండా హిందీలో రీమేక్ చేయడం ఇల్లీగల్ అంటూ రాసుకొచ్చారు. అయితే దీనిపై ఇప్పటివరకు శంకర్ స్పందించలేదు. బాలీవుడ్ లో ఈ సినిమాను పెన్ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. మరి ఈ లీగల్ ఇష్యూపై దర్శకనిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!