అదేంటో.. నాని టైం ఈ మధ్య అస్సలు బాగున్నట్టు లేదు. గతేడాది ‘జెర్సీ’ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ మరియు రివ్యూలు వచ్చినప్పటికీ పక్కన ‘కాంచన 3’ ఎఫెక్ట్ వల్ల బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన ‘జెర్సీ’ హిట్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఇక ఎంతో ఇష్టపడి చేసిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రం కూడా ఓపెనింగ్స్ ను సాధించినా…
తరువాత డ్రాప్ అయిపొయింది. దీంతో అదికూడా ప్లాప్ గానే మిగిలింది. ఇదిలా ఉంటే… ఈ ఏడాది .. ఈపాటికే విడుదల కావాల్సిన ‘వి’ చిత్రం కరోనా ఎఫెక్ట్ వల్ల విడుదల కాలేదు. పోనీ ఆ చిత్రం ఏదో ఒక టైములో విడుదలవుతుంది.. కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు.ఎటొచ్చి తాను నిర్మాతగా …
రూపొందించిన సినిమాలు ‘అ!’ మరియు ‘హిట్’ చిత్రాలకు ఇంకా బిజినెస్ జరగకపోవడం నాని ని కంగారు పెట్టే అంశం అని తెలుస్తుంది. రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. థియేట్రికల్ రైట్స్ ప్రకారం నాని కి లాభాలను మిగిల్చింది. అయితే శాటిలైట్ రైట్స్ మాత్రం అవ్వడం లేదు. నిజానికి ఈ టైంకి అమ్మేసి ఉంటే.. ఎలాగూ లాక్ డౌన్ టైం కాబట్టి మంచి టి.ఆర్.పి రేటింగ్ వచ్చే అవకాశం కూడా వుండేది. ఇలా నానిది బ్యాడ్ లక్ అనే చెప్పాలి.