Vishnu Priya: ఫేస్ బుక్ లో విష్ణు ప్రియకి చేదు అనుభవం.. ఆశ్లీల ఫొటోలు షేర్ చేసి..?

  • October 19, 2022 / 06:26 PM IST

విష్ణు ప్రియ భీమినేని ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.బుల్లితెర పై ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు, హాట్ హాట్ డాన్స్ లు చేసిన వీడియోలు షేర్ చేస్తూ కుర్ర కారుకి నిద్ర లేకుండా చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఈ మధ్య కాలంలో వెండితెరపై కూడా ఈమె బిజీగా రాణిస్తుంది.

ఈ మధ్యనే బిగ్‌బాస్‌ ఫేమ్‌ మానస్‌తో కలిసి చేసిన ప్రైవేట్‌ ఆల్బమ్‌ చేసిన విష్ణు ప్రియ .. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ ను సొంతం చేసుకుంది. వెబ్‌ సిరీస్‌ లలో కూడా ఈమె నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఇదిలా ఉండగా… విష్ణు ప్రియ కి సంబంధించిన కొన్ని వల్గర్ వీడియోస్, మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఏకంగా అవి ఆమె ఫేస్బుక్ ఖాతా ద్వారానే పోస్ట్ అవ్వడం అందరికీ షాకిచ్చింది. అక్టోబర్ 18న అంటే మంగళవారం నాడు రాత్రి విష్ణుప్రియ ఫేస్‌బుక్‌ పోస్టులు అందరికీ షాకిచ్చాయి. విష్ణుప్రియకు ఏమైంది.. సడన్ గా ఇలాంటి పోస్టులు పెడుతుంది అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. విష్ణుప్రియకు సంబంధించి మాత్రమే కాదు కొంతమంది మహిళలకు సంబంధించిన నగ్న ఫోటోలు విష్ణు ప్రియ ఫేస్బుక్ లో షేర్ అయ్యాయి.

ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గమనించిన విష్ణుప్రియ కూడా ఒక్కసారిగా షాకయ్యింది. ‘తన ఫేస్ బుక్ ను ఎవరో హ్యాక్ చేశారు. దయచేసి ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి. అలాగే విష్ణు ప్రియ భీమనేని అనే ఫేస్బుక్ అకౌంట్ ను కూడా కొంతకాలం అన్ ఫాలో చేయండి’ అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus