బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎవరిద్దరి మధ్యన గొడవ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. నిన్న మొన్నటిదాకా బాగా కలిసి ఉంటారు. అప్పుడే చిన్న విషయానికి కూడా గొడవపెట్టేస్కుంటారు. అంతేకాదు, సిల్లీ రీజన్స్ తో కూడా ఒకరినొకరు నామినేట్ చేస్కుంటారు. ఇందులో కూడా వారి గేమ్ ప్లాన్ ని వర్కౌట్ చేస్తుంటారు. ముఖ్యంగా నామినేషన్స్ అప్పుడు వారి గేమ్ ఎంత జెన్యూన్ అనేది ప్రూవ్ చేస్కోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు 9వ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ హీటెక్కుతున్నట్లుగానే కనిపిస్తోంది. రీసంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో అభిజిత్ పైన అమ్మరాజశేకర్ ఫైర్ అవుతుంటే, అభిజిత్ కూడా మాటకి మాట చెప్పి రచ్చ రచ్చ చేశాడు. బాగా ఆవేశపడ్డాడు.
నువ్వెంత అంటే నువ్వెంత అనేలా ఈ ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ తో హౌస్ హీటెక్కినట్లుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ గొడవ చూస్తుంటే అభిజిత్ నోయల్ విషయంపై అమ్మరాజశేఖర్ ని నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీన్ని డిపెండ్ చేస్కోవడానికి అమ్మరాజశేఖర్ మాస్టర్ ఆవేశంగా అభిజిత్ పై మాటలు విసిరాడు. ఎప్పుడూ కూల్ గా ఇష్యూని డీల్ చేసే అభిజిత్ అమ్మరాజశేఖర్ పై ఫైర్ అయ్యాడు. మరి వీరిద్దరి మధ్యలో గొడవ ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి.
అంతేకాదు, వీరిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటుంటే.., మిగతా హౌస్ మేట్స్ అందరూ అలా చూస్తూ ఉండిపోవడం కూడా ఈ ప్రోమోలో చూపించారు. ఈవారం నామినేషన్స్ ప్రక్రియలో కోడిగుడ్డు తలపై కొట్టి ఒకరినొకరు నామినేట్ చేస్కుంటూ తగిన రీజన్స్ చెప్పాలి. ఇందులో భాగంగానే వీరిద్దరి మధ్యన ఆర్గ్యూమెంట్ అనేది జరిగింది. మరి ఇందులో ఎవరు ఫైనల్ గా కూల్ అయ్యారు అనేది చూడాలి. అదీ విషయం.
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?