హోస్ట్ తో కంటెస్టెంట్ ల పై కూడా క్లారిటీ వచ్చేసింది..!

  • May 2, 2020 / 01:33 PM IST

అప్పటి వరకూ నార్త్ లో మాత్రమే పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో… సౌత్ లో కూడా విశేష ఆదరణ దక్కించుకుంది. తెలుగు, మలయాళం, తమిళ్ లో బిగ్ బాస్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఇప్పటికే మూడు సీజన్ లు పూర్తి చేసుకుని… నాలుగో సీజన్ కు కూడా రంగం సిద్దమైంది. అవును ప్రస్తుతానికి అయితే అయితే తమిళ్ కు సంబంధించి కంటెస్టెంట్ లు ఎవరు అనే క్లారిటీ కొంత వరకూ వచ్చేసింది. రమ్య పాండియన్‌, పుగళ్‌, శివంగి, వీజే మణిమేగలై వంటి సెలబ్రిటీలు సీజన్ 4 కు హౌస్ మేట్స్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువ ఉన్నాయి.

ఇక మూడు సీజన్ లకు హోస్ట్ గా కమల్ హాసన్ వ్యవహరిస్తే నాలుగో సీజన్ కు శింబు హోస్ట్ గా చేస్తాడు అని వార్తలు వచ్చాయి.కాని కమల్ హాసనే నాలుగో సీజన్ కు కూడా హోస్ట్ గా చేస్తాడు అని తెలుస్తుంది. ఇక తెలుగు విషయానికి వస్తే… బిగ్ బాస్ సీజన్ 1 ను ఎన్టీఆర్.. సీజన్ 2 ను.. నాని, సీజన్ 3 ను నాగార్జున హోస్ట్ చేసారు. ఇక సీజన్ 4 ను చిరంజీవి లేదా మహేష్ బాబు హోస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

కానీ వాటిలో నిజం లేదు సీజన్ 4 ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారు అని తెలుస్తుంది. ఇక సీజన్ 3 కోసం శ్రద్దా దాస్, కమల్ కామరాజు, హేమ చంద్ర వంటి వారిని కొన్ని కారణాల వల్ల ఫైనల్ చెయ్యలేదు. అయితే సీజన్ 4 లు వాళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. జూన్ ఎండింగ్ లేదా జూలై 4 వ వారం నుండీ ‘బిగ్ బాస్ 4’ మొదలు కానుందని టాక్ నడుస్తుంది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus