బిగ్ బాస్4: అభిజిత్ దెబ్బ.. అవినాష్ అబ్బ..!

  • November 3, 2020 / 11:28 AM IST

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ హీటెక్కాయనే చెప్పాలి. ముఖ్యంగా అరియానా సోహైల్ ని నామినేట్ చేసేసరికి, సోహైల్ తన ప్రస్టేషన్ మొత్తాన్ని అరియానాపై తీర్చేసుకున్నాడు. వేరే రీజన్ చెప్తే బాగుండేది కాని ఇదేం రీజన్ అంటూ సోహైల్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ప్రస్టేషన్ ని చూపించాడు. తర్వాత సోహైల్ అభిజిత్ ని నామినేట్ చేస్తూ ఇదే మూడ్ ని క్యారీ చేశాడు. నీతో నాకు అస్సలు కంఫోర్ట్ లేదని చెప్పాడు. అంతకుముందు అవినాష్ అభిజిత్ ని నామినేట్ టాస్క్ విషయంలో 100 శాతం ఇవ్వడం లేదంటూ చెప్పాడు. అంతేకాదు, నోయల్ విషయంలో అనవసరంగా ఇన్వాల్ అయ్యి నా పైయిన్ ని అర్ధం చేస్కోలేదని చెప్పాడు. సాటి కళాకారుడిగా నువ్వు అర్ధం చేస్కుంటావని అనుకున్నాను అన్నాడు.

ఇక్కడే ఇద్దరి మద్యలో బాగా ఆర్గ్యూమెంట్ అయ్యింది. ఎప్పుడైతే అభిజిత్ అవినాష్ ని తిరిగి మళ్లీ నామినేట్ చేశాడో అప్పుడు ఇద్దరి మద్యలో అగ్గిరాసుకుంది. అభిజిత్ లాజిక్ గా అడుగుతున్న ప్రశ్నలకి అవినాష్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. అంతేకాదు, చాలా గట్టిగానే పాయింట్స్ అడిగాడు అభిజిత్. జోకులు వేయడం తప్పుకాదని, కానీ నాపై జోకులు వేయద్దని చెప్పాడు. దీనికి అవినాష్ తిరిగి కౌంటర్ ఎటాక్ చేశాడు. బరాబర్ మాట్లాడతా.. జోకులు వేస్తా.. నేను ఎంటర్ టైన్ చేయడానికి వచ్చాను షోకి. అంటూ రెచ్చిపోయాడు అవినాష్. అయితే, ఇక్కడ లాజిక్ మిస్ అయ్యాడు. తనకోపం ఏదైనా ఉంటే అది నోయల్ పైన తీర్చుకోవాలి. ఇక్కడ అభిజిత్ చెప్పే పాయింట్ నోయల్ గురించి అయితే ఖచ్చితంగా కాదు. తనకి జరిగిన ఇష్యూని చెప్తున్నాడు.

దానిపైన అవినాష్ మాట్లాడలేదు. నోయల్ ఇష్యూలో బాగా అప్సెట్ అయిన అవినాష్ అదే విషయాన్ని ఆడియన్స్ కి పదే పదే గుర్తుచేయాలని చూస్తున్నాడు. అంతేకాదు, అభిజిత్ కెమెరాలు ఉన్నాయని నటిస్తున్నావ్ నాకు కూడా తెలుసు అంటూ రీకౌంటర్ కూడా వేశాడు. వీరద్దరిమధ్యన ఆర్గ్యూమెంట్ తో హౌస్ హీటెక్కిపోయింది. 9వ వారం నామినేషన్స్ లో అభిజిత్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. మరి హారిక కూడా వీరిద్దరినే నామినేట్ చేస్తుందా.. ? లేదా..? అనేది ఆసక్తికరం.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus