బిగ్ బాస్ 4: అన్ సీన్ లో అవినాష్ ఆవేదన..!

  • December 2, 2020 / 12:46 PM IST

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ రాంగానే లెక్కలు అన్నీ మారిపోతాయి.. అందులోనూ ఈసారి వచ్చింది రేస్ టు ఫినాలే టాస్క్ కాబట్టి అందరూ కూడా ప్రాణం పెట్టి మరీ ఆడారనే చెప్పాలి. అయితే, ఇక్కడే ఆవుపాలకోసం పెద్ద యుద్ధమే చేశాడు అవినాష్. ఫస్ట్ మోనాల్ దగ్గర తను నింపుకున్న పాల క్యాన్ లో నుంచి పాలని కొట్టేశాడు. దీంతో మోనాల్ కి కోపం వచ్చింది. అవినాష్ వెంటబడి మరీ పాలని రీకలక్ట్ చేసుకుంది. కానీ , అవినాష్ అక్కడ కొద్దిగా పాలని మాత్రమే ఇచ్చాడు. ఈసారి తను పాలు పట్టుకోవాడానికి ఆవు కిందకి దూరినపుడు మోనాల్ కాలితో అవినాష్ ని తన్నింది. దీంతో అవినాష్ కి కోపం వచ్చింది.

మోనాల్ ‘షూ’ ని బలంగా లాగి అవతలకి విసిరేశాడు. ఇది చూసిన అఖిల్ అవినాష్ ని చూసి ఆడూ.. అంటూ మాట్లాడాడు. అయితే, అవినాష్ ఈసారి మోనాల్ పైన కోపంతో పాలు వచ్చేటపుడు గోల గోల చేశాడు. మోనాల్ ని డిస్టర్బ్ చేశాడు. సోహైల్ వచ్చి రూడ్ గా ఆడటంతో అవినాష్ చేసేది ఏమీ లేక గేమ్ నుంచి వాకౌట్ అయిపోయాడు. తర్వాత సోహైల్ బ్రతిమిలాడినా కూడా గేమ్ ఆడేందుకు నిరాకరించాడు. తన పాలలో నీళ్లు కలుపుకుని స్మార్ట్ గేమ్ ఆడేందుకు ట్రై చేశాడు. బిగ్ బాస్ చెప్పేసరిగి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మోనాల్ నన్ను తన్నింది అంటూ అందరితో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఫస్ట్ అభిజిత్ తో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. అభిజిత్ కూడా మోనాల్ తన్నడం చూశాను అని చెప్పాడు.

ఇక్కడ మోనాల్ కూడా ఒప్పుకుంది. ఇది గేమ్ అయితే అంటూ మాట్లాడింది మోనాల్. తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత వచ్చి అవినాష్ కి సారీ చెప్పింది. ఇక అవినాష్ తన ఆవేదనని అఖిల్ తో స్మోకింగ్ రూమ్ లో పంచుకున్నాడు. ఆవు దగ్గర ఏం జరిగిందో అఖిల్ కి చెప్పాడు. నిజంగా మోనాల్ నన్ను తన్నింది అని, ఒకటి రెండుసార్లు చూసిన తర్వాత కోపం వచ్చి నేను షూ లాగి పారేశాను అని మాత్రమే చెప్పాడు. అది మీకు కనిపించలేదని, నన్ను గేమ్ ఆడనివ్వకుండా చేశారు అంటూ తన ఆవేదనని వ్యక్త పరిచాడు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus