పెళ్లి పీటలెక్కిన బిగ్ బాస్ బ్యూటీ అలీనా పడిక్కల్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • August 31, 2021 / 03:21 PM IST

తెలుగు లో త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారం కానున్న విషయం తెల్సిందే. అయితే ఇటు తెలుగు తో పాటు పలు ఇతర సౌత్ భాషల్లో కూడా ఎంతో పాపులరైన ఈ షో, మలయాళ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంది. ఇక ఇటీవల గత మళయాళం బిగ్ బాస్ సీజన్ లో ఒక పార్టిసిపెంట్ గా పాల్గొన్న అలీనా పడిక్కల్ గత కొన్నాళ్లుగా ప్రదీప్ అనే వ్యక్తితో లవ్ లో ఉంది.

ఇక ఎట్టకేలకు ఈమె తాజాగా ప్రదీప్ ని వివాహం చేసుకుంది. వృత్తి రీత్యా వ్యాపారవేత్త అయిన ప్రదీప్ తో ఆమెకు దాదాపుగా ఏడేళ్లుగా మంచి అనుబంధం ఉందని, ఆ తరువాత బంధం ప్రేమాగా మారడంతో పాటు కొన్నాళ్లుగా ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని సరదాగా గడిపారట. ఆపై ఇరు కుటుంబాలని ఒప్పించి వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. టివి నటిగా, ఆపై పలు సినిమాల్లో కూడా నటించి మంచి పేరు దక్కించుకున్నారు అలీనా. ప్రస్తుతం ఆమె వివాహ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

పక్కాగా కరోనా నియమాల మధ్య, అలానే కేవలం వారి ఇరు కుటంబాల పెద్దలు మాత్రమే హాజరైన వీరి వివాహం ఎంతో వేడుకగా జరిగింది. అయితే పెళ్ళికి హాజరు కాలేకపోయిన మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనేకమంది సినిమా ప్రముఖులు అలీనా, ప్రదీప్ దంపతులకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రత్యేకంగా వివాహ శుభాకాంక్షలు తెలియచేయగా, పలువురు అలీనా ఫ్యాన్స్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus