నెం.3 కి ఇంత క్రేజ్‌ ఎక్కడ్నుంచబ్బా

  • January 7, 2021 / 12:24 PM IST

బిగ్‌బాస్‌ విజేత అభిజీత్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే… అయితే అదే వేదికపై పేరు తెచ్చుకున్న మరో కంటెస్టెంట్‌ సోహెల్‌. ఒక విధంగా ఫైనల్‌లో ఎక్కువ ఫుటేజ్‌ సంపాదించిన వారిలో సోహెల్‌ ప్రథముడనే చెప్పాలి. ఆ జోరు ఇంటి నుంచి బయటికొచ్చాక కూడా కనిపిస్తోంది. వచ్చీ రాగానే సినిమాలు ఓకే చేస్తున్నాడు. ‘మంచి సినిమా చేస్తా.. తప్పక చేస్తా’ అంటూ స్టేజీ దగ్గర అన్నాడు. ఇప్పుడు చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి.

అయితే దీంతోపాటు ఓ బాలీవుడ్‌ అవకాశం కూడా సంపాదించాడట. సోహెల్‌ ఇటీవల ‘రోజ్‌ విల్లా’ అనే సినిమా ప్రచార కార్యక్రమం కోసం వచ్చాడు. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలే అతని బాలీవుడ్‌ ఎంట్రీ గురించి చెబుతున్నాయి. తన ఆప్త మిత్రుడు రామారావు కోసం ఇక్కడికి వచ్చాను అంటూ చెబుతూ అతను తనకు ఓ హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం కూడా ఇచ్చాడంటూ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఆ వెబ్‌ సిరీస్ ప్రారంభమవుతుందని సమాచారం.

ఇదంతా చూస్తుంటే బిగ్‌బాస్‌ అభిమానులకు ఆనందం, ఆశ్చర్యం కలగకమానవు. పెద్దగా ఫేమ్‌ లేకుండా బిగ్‌బాస్‌లోకి వచ్చి ఫేమ్‌ సంపాదించి, ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడంటే సోహెల్ క్రేజ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంత క్రేజ్‌ ఎలా వచ్చిందబ్బా… బిగ్‌బాస్ హౌస్‌లో అతని రియల్‌ నేచరా, లేక ఫైనల్‌లో వచ్చిన హైపా.. ఏమోమరి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌ చేయండి.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus