Adhi, Geetu: అంట్లు తోమిన ఆది, అతి చేసిన గీతు..! ఎపిసోడ్ లో హైలెట్స్ ఇవే..!

  • October 20, 2022 / 10:44 AM IST

బిగ్ బాస్ హౌస్ లో టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ టాస్క్ రద్దు చేసిన తర్వాత హౌస్ మేట్స్ ఓవర్ యాక్షన్ మొదలైంది. అందరూ బిగ్ బాస్ ని బతిమిలాడారు. టాస్క్ కంటిన్యూ చేయమని అడిగారు. కానీ, బిగ్ బాస్ కనికరించలేదు. దీంతో హౌస్ మేట్స్ చేసేది లేక గేమ్ ఎవరి వల్ల పోయిందో అని లెక్కలు వేసుకున్నారు. దీంతో సూర్య అన్నమాటలకి ఇనయ ఫీల్ అయిపోయింది. అలాగే, ఒకరినొకరు నిందించుకుంటూ టైమ్ పాస్ చేశారు.

ఈలోగా బిగ్ బాస్ ఇంట్లోకి దొంగలని పంపించాడు. వాళ్లు హౌస్ మేట్స్ ఫుడ్ మొత్తం లాగేసుకున్నారు. తిరిగి ఫుడ్ సంపాదించుకోవాలంటే ఛాలెంజస్ ఆడాలని చెప్పాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ రెండు టీమ్స్ గా విడిపోయి కబడ్డీ గేమ్ ఆడారు. సంచాలక్ గా గీతు రెండు టీమ్స్ ని కబడ్డ గేమ్ ఆడించింది. ఇందులో గెలిచిన టీమ్ కి ఫుడ్ ఇచ్చాడు. అంతేకాదు, గెలిచిన టీమ్ మాత్రమే తినాలని కండీషన్ పెట్టాడు.

ఈసారి హౌస్ మేట్స్ రూల్స్ అతిక్రమిస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదని హెచ్చరించాడు. ఇక్కడే బిగ్ బాస్ పంపిన ఫుడ్ సంచాలక్ కూడా షేర్ చేసుకుని తిన్నది. ఆ తర్వాత ఛాలెంజ్ లో గీతు ఆపోజిట్ టీమ్ గెలిచింది. సంచాలక్ గా ఉన్న ఫైమా గెలిచిన టీమ్ లో ఉంది. అయినా కూడా ఆదిరెడ్డితో కలిసి చపాతీ కర్రీని టేస్ట్ చేసింది గీతు. దీంతో బిగ్ బాస్ కి ఒళ్లు మండింది. రూల్స్ పాటించడంలో హౌస్ మేట్స్ వారి తెలివితేటల్ని వాడుతున్నారు.

ముఖ్యంగా ఆదిరెడ్డి, గీతు ఇద్దరికీ అంట్లు తోమమని పనిష్మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ అంట్లు తోముతూ కూడా గీతు సెటైర్స్ వేస్తునే ఉంది. చేతులకి గ్లౌజస్ వేసుకుని మరీ అంటులో తోమింది. అలాగే, మిగతా హౌస్ మేట్స్ అందరూ గీతుని టీజ్ చేస్తూ పాటలు పాడారు. ఈ అంట్లు తోమే ఎపిసోడ్ అయినపోయిన తర్వాత నేను ఇంట్లో కూడా ఎప్పుడూ అంట్లు తోమలేదని ఆదిరెడ్డి అంటే, నేను చేయి కడుక్కుంటానికి కూడా బౌల్ తీస్కుని వస్తారని గీతు చెప్పింది.

ఈ ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు వీరిద్దరికి బాగా జరిగిందని అనుకున్నారు. బిగ్ బాస్ గేమ్ ని బాగా ఒంటపట్టించుకుని ఎక్కడ లూప్స్ ఉన్నాయో దాన్ని పట్టుకుని గేమ్ ఆడుతున్నారని, అంతేకాదు, అస్సలు రూల్స్ పాటించడం లేదని అందుకే వారి తీట బిగ్ బాస్ తీర్చాడని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఎపిసోడ్ లో వీరిద్దరూ హైలెట్ గా నిలిచారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus