Hariteja: ఆ కారణంతోనే ఫిదా సినిమా నుంచి రిజెక్ట్ చేశారు!

  • October 3, 2023 / 06:57 PM IST

సుధీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మామ మశ్చేంద్ర. ఈ సినిమా ఈనెల ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. అయితే ఈ సినిమాలో నటి హరితేజ కూడా భాగమైనటువంటి విషయం మనకు తెలిసిందే.ఈమె కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే హరితేజ మాట్లాడుతూ శేఖర్ కమ్మల గారిని చూస్తూ ఒకసారి మిమ్మల్ని చూడగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఆ విషయాన్ని ఇక్కడ అందరితో పంచుకోవాలనిపించిందనీ తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి, వరుణ్ తేజ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్క పాత్రలో నటించడానికి ఆడిషన్స్ కి రమ్మని చెప్పారని తెలిపారు.

ఇలా తాను ఆడిషన్స్ కి వెళ్ళానని రెండు మూడు సార్లు ఆడిషన్ ఇచ్చినప్పటికీ నన్ను ఈ సినిమా నుంచి రిజెక్ట్ చేశారని ఈమె తెలియజేశారు. అలా నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయం గురించి ఆలోచిస్తే కేవలం నాకు తెలంగాణ యాస రాదనే కారణం తోనే నన్ను రిజెక్ట్ చేశారని ఈ సందర్భంగా హరితేజ వెల్లడించారు.

అప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడటం రాకపోవడంతోనే నాకు (Hariteja) ఈ సినిమాలో ఛాన్స్ మిస్ అయిందని లేకపోతే సాయి పల్లవి అక్క పాత్రలో తానే కనిపించేదానినని తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ యాస చాలా బాగా వస్తుంది అంటూ ఈమె ఫిదా సినిమాలో ఛాన్స్ మిస్ అవ్వడానికి గల కారణాన్ని తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus