Bigg Boss: బిగ్ బాస్ సీజన్ – 6 ఎప్పటినుంచి మొదలవ్వబోతోందంటే..?
May 19, 2022 / 05:14 PM IST
|Follow Us
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ -1 అనేది అంతిమ దశకి చేరుకుంది. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పైన బాగా పెర్ఫామ్ చేసిన పార్టిసిపెంట్స్ ని ఇప్పుడు సీజన్ – 6లో నేరుగా టెలివిజన్ లోకి సెలక్ట్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈనేపథ్యంలో కొంతమంది పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి ఈసారి సీజన్ అనేది ఓటీటీలో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. టెలివిజన్ షోకి వచ్చినంత క్రేజ్ మాత్రం రాలేదనే చెప్పాలి. అయితే, కొంతమంది పార్టిసిపెంట్స్ మాత్రం బాగా హైలెట్ అయ్యారు.
అందులో మిత్రాశర్మా, యాంకర్ శివలు ముఖ్యంగా ఉన్నారు. ఇక బిందుమాధవి అయితే, తమిళ సీజన్ లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసింది కాబట్టి టెలివిజన్ ప్రేక్షకులకి బాగా సుపరిచుతురాలే. అందుకే, ఇప్పుడు కొంతమందిని సీజన్ – 6లో తీసుకోబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. యాంకర్ శివ, మిత్రా శర్మా, బిందు మాధవి, అజయ్, ఆర్జే చైతూ ఈ ఐదుగురు ముఖ్యంగా ఉండబోతున్నారు. వీళ్లతో పాటుగా అనిల్ రాథోడ్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది.
కానీ, బిందు మాధవి ఈ సీజన్ లో విన్నర్ అయితే మాత్రం ఛాలెంజర్స్ నుంచీ సీజన్ 6కి పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేది అనుమానమే. ఇప్పటికే 84రోజుల పాటు హౌస్ లో ఉండి, మళ్లీ ఇంకోసారి 100 రోజులు ఉండాలంటే కష్టంగానే ఉంటుంది. మరి ఇలాంటి టైమ్ లో బిందు మినహాయిస్తే మిగిలిన ఐదుగురు ఖచ్చితంగా సీజన్ – 6లో ఉండబోతున్నారనే అంటున్నారు. మరోవైపు సీజన్ – 6 కోసం మిగతా పార్టిసిపెంట్స్ ని కూడా రెడీ చేస్తోంది బిగ్ బాస్ టీమ్.
ప్రస్తుతం జబర్ధస్త్ టీమ్ లో కొంతమందితో చర్చలు జరుపుతున్నారు. అలాగే, మాజీ హీరోయిన్స్ ని కూడా అప్రోచ్ అయినట్లుగా సమాచారం. వీళ్లతో పాటుగా ఇప్పుడు ఓటీటీ సీజన్ లో ఉన్న ఐదుగురు కూడా లిస్ట్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ సీజన్ – 6 ని అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. జూలై 31వ తేది, లేదా ఆగష్టు 7వ తేదిన ఈ షోని స్టార్ట్ చేయాలని సన్నాహాలు చేస్తోంది బిగ్ బాస్ టీమ్.
టెలివిజన్ షోతో పోలిస్తే ఈసారి ఓటీటీ సీజన్ అంతగా సక్సెస్ అవ్వకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. పార్టిసిపెంట్స్ ఆడిన టాస్క్ లు, చేసిన నామినేషన్స్ , వాళ్ల మద్యలో జరిగిన గొడవలు, ఇవన్నీ కూడా హైలెట్ అయ్యాయి. అంతేకాదు, ఈసారి సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అని పెట్టిన కాన్సెప్ట్ కూడా బిగ్ బాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుందనే చెప్పాలి. అందుకే, ఇప్పుడు సీజన్ – 6లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుందనే అంటున్నారు బిగ్ బాస్ వ్యూవర్స్. అదీ మేటర్.