Sohel: డౌన్ ఫాల్ స్వీకరించలేకపోయాను!

  • August 7, 2023 / 11:48 PM IST

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సోహెల్ ఒకరు. ఈయన బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఒక్కసారిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సోహెల్ అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా ఆగస్టు 18 వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన కెరియర్ డౌన్ ఫాల్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఎత్తు పల్లాలు ఉండటం సర్వసాధారణం. అయితే నేను బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాను. ఈ కార్యక్రమం తర్వాత ఒక్కసారిగా నా కెరియర్ డౌన్ ఫాల్ అవ్వడంతో దానిని స్వీకరించలేక పోయానని దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని సోహెల్ వెల్లడించారు.

అలాంటి సమయంలో తనకు ధైర్యం చెప్పి తనను (Sohel) ముందుకు తీసుకు వచ్చినది నాగార్జున గారేనని ఈయన తెలిపారు. ఇక బిగ్ బాస్ షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున గారిని కలిసి నా సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి తప్పకుండా రావాలి సార్ అని పిలవడంతో ఆయన తన బాధను అర్థం చేసుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చారు అంటూ సోహెల్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags