ఈసారి మరింత ఘోరంగా తయారైన ‘బిగ్ బాస్’ హౌస్

  • August 19, 2019 / 01:44 PM IST

‘బిగ్ బాస్’ అనేసరికి… ఎవరు హోస్ట్ చేస్తున్నారు అనేదానికన్నా… హౌస్ లో జరిగే వివాదాలే ఎక్కువ గుర్తొస్తుంటాయి. వాళ్ళు కావాలని గొడవలు పెట్టుకుంటారో ఏమో కానీ .. ఆ గొడవలు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే సృష్టిస్తుంటాయి. ఇప్పుడు ఆ వివాదాలకు మించి ఒక దారుణమైన విషయం ఒకటి చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే… తమిళ బిగ్ బాస్ మూడో సీజన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ మొదలైనప్పటి నుండీ ఏదొక వివాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఈ సీజన్ లో ఇప్పటికే ఓ హౌస్ మేట్ ను మధ్యలోనే హౌస్ నుండి బయటకి పంపేశారు.

ఇప్పుడు మరో వ్యక్తిని కూడా హౌస్ నుండీ బయటకి పంపేసారట. ఆ వ్యక్తి ఎవరంటే… హాస్యనటి మధుమిత. కోలీవుడ్ లో ‘ఒరుకల్‌ ఒరు కన్నాడీ’ చిత్రంలో హాస్యనటిగా నటించిన మధుమిత ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 3’ కి ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు యాభై రోజులకు పైగా హౌస్ లో ఉన్న మధుమిత ఈ మధ్యే కెప్టెన్ బాధ్యతలు చేపట్టింది. అయితే శనివారం నాడు ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందట. దీంతో ఆమెని ‘బిగ్ బాస్’ హౌస్ నుండీ బయటకి పంపేశారట. హౌస్ లో ఉన్న కవిన్ అలానే మిగిలిన కొందరి మధ్య జరిగిన వాదనల కారణంగా మధుమిత సూసైడ్ అటెంప్ట్ చేసుకుందట. స్వయంగా మధుమితనే ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ క్రమంలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్.. మధుమిత చేసిన పని పై మండిపడ్డారు. హౌస్ లో మధుమిత ఓ బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus