‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ లకు కరోనా భయం.. కారణం అదే..!

  • July 13, 2020 / 04:37 PM IST

కరోనా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మునుపటికంటే విస్తరిస్తుంది. లాక్ డౌన్ ఆంక్షలు లేకపోవడంతో.. ప్రజలు ఇష్టమొచ్చినట్టు తిరిగేస్తున్నారు. దీంతో కేసులు మరింతగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ దారుణం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు.. ‘నువ్వా నీనా’.. అన్నట్టు పోటీ పడుతున్నాయి. పలు పట్టణాల్లో లాక్ డౌన్ నియమాలను మళ్ళీ కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉండగా..ఇప్పుడు సామాన్యులు మాత్రమే కాదు..సెలబ్రిటీలు కూడా కరోనా భారిన పడటం మనం చూస్తూనే వస్తున్నాం. అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ ఫ్యామిలీనే కరోనా భారిన పడింది అంటే సామాన్యులు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు.

సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. ‘ఆమె కథ’ హీరో హీరోయిన్లు అయిన రవికృష్ణ, నవ్య స్వామీ… లు ఇద్దరికీ కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ హీరో రవికృష్ణ ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ అన్న సంగతి కూడా తెలిసిందే. అయితే గత నెల ఇతని ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసుకున్నాడట. దీనికి ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ లు అయిన.. హిమజ, శివజ్యోతి, రోహిణి, అలీ రేజా వంటి వారు కూడా హాజరయ్యారు.

వీరందరినీ కూడా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని రవికృష్ణ తన సోషల్ మీడియా ద్వారా కోరాడు. ఈ క్రమంలో వారంతా టెస్ట్ లు చేయించుకోగా వారికి నెగిటివ్ వచ్చినట్టు తెలిసింది. ఇక రవికృష్ణ ప్రస్తుతం తన ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

1

2

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus