Bigg Boss: బిగ్ బాస్ సీజన్ సరికొత్తగా స్టార్ట్ కాబోతోందా..? టెలికాస్ట్ ఎప్పుడు ? రూల్స్ ఏంటి’
December 20, 2021 / 11:31 AM IST
|Follow Us
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అనేది చాలా గ్రాండ్ గా ముగిసింది. అంతేకాదు, హౌస్ లో ప్రతి ఒక్కరూ కూడా టార్గెట్ చేసిన సన్నీనే విన్నర్ గా నిలిచాడు. షణ్ముక్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు. నిజానికి చాలామంది శ్రీరామ్ చంద్ర గెలుస్తాడని ఊహించారు. కానీ, సన్నీనే విన్నర్ అయ్యాడు. సన్నీ ఫ్రెండ్స్ మానస్ ఇంకా కాజల్ ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. మరోవైపు కింగ్ నాగార్జున విన్నర్ కి ట్రోఫీతో పాటుగా సర్ ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు.
అంతేకాదు, చివర్లో సైనింగ్ ఆఫ్ చెప్తూ మరో రెండు నెలల్లో బిగ్ బాస్ ప్రారంభం కాబోతోందని, 9నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. దీంతో ఎప్పట్నుంచో తెలుగులో ఓటీటీలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ గురించి క్లారిటీ వచ్చేసింది.బిగ్ బాస్ తెలుగు ఓటీటీ అనేది ప్రారంభం కాబోతోంది. నిజానికి ఇది హిందీలో ఈ సంవత్సరమే ప్రారంభించారు. కరణ్ జోహార్ యాంకర్ గా చేసిన ఈ షో ఆశించినంత ఫలితాన్ని దక్కించుకోలేదు.
కానీ, తెలుగు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు. దీని గురించే నాగార్జున ఫినాలే స్టేజ్ పైన ఎనౌన్స్ చేశాడు. అయితే, ఇది బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గా ఉంటుందా, లేదా ఓటీటీలో సీజన్ – 1 గా ప్రారంభిస్తారా అనేది ఆసక్తికరం. ఈ షో కేవలం హాట్ స్టార్ లేదా ఏదైనా ఓటీటీలో మాత్రమే ప్రసారం అవుతుంది. దీనికి సపరేట్ పార్టిసిపెంట్స్ ని సెలక్ట్ చేస్తారు. ఇందులో విన్నర్స్ గా నిలిచిన టాప్ 5 కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కోసం ఎంపిక చేస్తారు.
ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఓటీటీ అనేది వచ్చే సంవత్సరం 2022లో జనవరి నెలాఖరులో కానీ, లేదా ఫిబ్రవరి మొదటివారంలో కానీ ప్రారంభించే అవకాశం ఉంది. దీనికోసం ఇప్పట్నుంచే బిగ్ బాస్ టీమ్ రెడీ అవుతోంది. ఇప్పుడున్న సెట్ లోనే కొన్ని మార్పులు చేసి దీనిని నిర్వహిస్తారు. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతోంది. ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు అనేది తెలియాలంటే మనం మరిన్ని రోజులు ఆగాల్సిందే. అదీ మేటర్.