Bigg Boss Telugu 6: ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఏమీ లేదు..! ఆదివారం ఎపిసోడ్ లో జరిగింది ఇదే..!
October 31, 2022 / 10:50 AM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో సండే అంటే ఫన్ డే అంటూ హౌస్ మేట్స్ తో రకరకాల గేమ్స్ ఆడించి ఎంటర్ టైన్ చేస్తాడు హౌస్ట్ నాగార్జున. వీటితో పాటుగా ఎలిమినేషన్ అనేది అత్యంత ఉత్కంఠంగా నడిపిస్తారు. కానీ, ఈవారం అసలు సండే ఎపిసోడ్ లో ఫన్ లేదు, ఉత్కంఠ అంతకన్నా లేదు. సుత్తి సండేలాగా గడిచింది. దీనికి కారణం శనివారమే ఆర్జే సూర్యని ఎలిమినేట్ చేయడమే. ఎలిమినేట్ ఎవరు అవ్వబోతున్నారు అనేది బిగ్ బాస్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తారు.
కానీ, ఆర్జేసూర్యని శనివారం ఎలిమినేట్ చేసేసి, ఆదివారం స్టేజ్ పైకి పిలిచేసి, జెర్నీ చూపించేసి, హౌస్ మేట్స్ తో టాటా చెప్పించేసి పంపించేశారు. దీంతో సండే ఎపిసోడ్ లో ఉండే ఆసక్తి కాస్తా పోయింది. ఇక మిగిలిని వాళ్లని సోసోగా సేవ్ చేస్తూ నాగార్జున ఏదో చేయబోయి ఏదో చేసినట్లుగా అయ్యింది. అసలు మేటర్లోకి వెళితే., ఆదివారం ఆర్జే సూర్య ఎలిమినేషన్ అయి స్టేజ్ పైకి వచ్చాడు. హుషారుగా హౌస్ మేట్స్ ని పలకరించాడు.
నిజానికి హౌస్ మేట్స్ అందరూ సూర్య సీక్రెట్ రూమ్ లో ఉన్నాడని అనుకున్నారు. కానీ, సూర్య హౌస్ మేట్స్ తో కలిసి ఒక టాస్క్ చేసి బైబై చెప్పి వెళ్లిపోయాడు. దీంతో హౌస్ మేట్స్ నమ్మక తప్పలేదు. ఐదుగురు హౌస్ మేట్స్ ఫైర్ అని, ఐదుగురు హౌస్ మేట్స్ ఫ్లవర్ అంటూ ట్యాగ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత లైక్ – షేర్ – సబ్ స్క్రైబ్ సినిమా టీమ్ సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఇద్దరూ వచ్చి స్టేజ్ పైన సందడి చేశారు.
హౌస్ మేట్స్ ని పలకరిస్తూ పాటల గేమ్ ఆడించారు. దీంతో ఆదివారం ఫన్ అనేది కాస్త జనరేట్ అయ్యింది. కానీ, నాగార్జున ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ అసలు ఏం జరుగుతుందో ఆడియన్స్ కి కానీ, హౌస్ మేట్స్ కి కానీ చెప్పలేదు. మొదట శనివారం డైరెక్ట్ ఎలిమినేషన్ అని చెప్పిన నాగార్జున కనీసం డబుల్ ఎలిమినేషన్ అంటూ హౌస్ మేట్స్ ఆసక్తి కలిగించాల్సింది. అలా ఏదీ చెప్పకుండా ఒక్కొక్కరినీ సేవ్ చేస్తుంటే హౌస్ మేట్స్ కి అర్ధం కాలేదు.
ఎలిమినేషన్ లో ఏం జరుగుతోందనేది ఆడియన్స్ కి కూడా క్లారిటీ లేదు. కనీసం ఆడియన్స్ కి అయినా హౌస్ మేట్స్ ని టెన్షన్ పెడదామని కానీ, లేదా డబుల్ ఎలిమినేషన్ అనేది కానీ ఎనౌన్స్ చేయాల్సింది. అలా చేయకుండా అందర్నీ సేఫ్ చేస్తూ వస్తుంటే ఆడియన్స్ కి ఎవరూ ఎలిమినేట్ కారనే విషయం తెలిసిపోయింది. దీంతో ఆసక్తి పూర్తిగా పోయింది. ఈవారం ఆదివారం సందడి లేని పసలేని సండేగా గడిచిపోయింది. ఇక ఈవారం ఎవరు నామినేషన్స్ లో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.