Bigg Boss 5 Telugu: ఎవరినైనా లేపాలంటే బిగ్‌బాస్‌ తర్వాతే!

  • October 21, 2021 / 10:10 AM IST

బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరూ యాక్టివ్‌గా ఆడతారు అనుకోకూడదు. ఐదు సీజన్లను చూస్తున్న అందరికీ ఈ విషయం తెలుసు. ఇంట్లో ఓ మూలకు ముభావంగా కూర్చొని వారి మీద, వీరి మీద జోకులేసుకునే బ్యాచ్‌ కొందరు ఉంటారు. గత సీజన్లలో ఇలా ఎవరున్నారు అనేది పక్కనపెడితే… ఈ సీజన్‌లో అలా కొంతమంది కనిపిస్తున్నారు. అలాంటివారిలో ఇప్పటికే కొందరు వెళ్లిపోగా… ఓ ఇద్దరు ఉన్నారు. వారిని పైకి లేపడానికి బిగ్‌బాస్‌ తెగ ప్రయత్నిస్తున్నారు.

బిగ్‌బాస్‌ ఇలా జాకీలేసి పైకి లేపేది అందరినీ కాదనే విషయం గుర్తుంచుకోవాలి. కొంతమందిని మాత్రమే ఇలా చేస్తుంటారు. వారు ఆడకపోతున్నా, ఎందుకు ఆడాలి అనుకున్నా… సీక్రెట్‌ టాస్క్‌లు ఇచ్చి మరీ ఆడిస్తుంటాడు. ఈ వారం అలాంటి బంపర్‌ జాకీ ఆఫర్‌ జెస్సీ అలియాస్‌ జశ్వంత్‌కు వచ్చింది. హంటర్‌ టాస్క్‌, ‘మిసెస్‌ ప్రభావతి’ గుడ్ల టాస్క్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన జెస్సీ ఈ వారం ఎలిమినేట్‌ అనే డౌట్‌ వచ్చింది. దీంతో సీక్రెట్‌ టాస్క్‌ బయటకు వచ్చింది.

ఇంటి సభ్యుల్లో ముగ్గురు దగ్గర గుడ్లు లేకుండా చేయాలి అని బిగ్‌బాస్‌ సీక్రెట్‌ టాస్క్‌ పెట్టారు. ఈ క్రమంలో మరొకరి సాయం తీసుకోవచ్చు అని చెప్పగా జెస్సీ… అందరూ ఊహించినట్లుగా సిరిని ఎంచుకున్నాడు. దీంతో సిరి ప్రియ, షణ్ముఖ్, ప్రియాంక దగ్గరకు వెళ్లి మీ దగ్గర గుడ్లు మాకిచ్చేస్తారా? తర్వాత మీరు ఆనందపడే విషయం చెబుతా అని చెప్పింది. దీంతో వారు ఇచ్చేశారు. ఇందులో జెస్సీ పడ్డ కష్టం ఏమీ కనిపించలేదు.

బిగ్‌బాస్‌ ఇలాంటి సీక్రెట్‌ టాస్క్‌లు ఇచ్చేది… ఇంట్లో ఎంటర్‌టైన్మెంట్‌ వస్తుందని, వాళ్ల టాలెంట్‌ తెలుస్తుందని. కానీ జెస్సీ సులభంగా డీల్‌ కుదుర్చుకొని ఆడేశాడు. సారీ సిరి ఆడితే… ఫలితం పొందాడు. దీనికి బదులు ఈ సీక్రెట్‌ టాస్క్‌ సిరికి ఇస్తే సరిపోయేది. ఓవైపు బిగ్‌బాస్‌ జాకీ లేస్తుంటే… జెస్సీ నేలకు పాతుకుని పోయి కూర్చుంటున్నారు. పాపం బిగ్‌బాస్‌.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus