నాగార్జున హోస్ట్ గా బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో సీజన్ 5లో రెండోవారం అందరూ ఊహించిన విధంగానే ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో ఇష్టానుసారం మాట్లాడటం ఉమాదేవికి మైనస్ గా మారిందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఉమాదేవి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలలో సిరి మాటలు వింటే షణ్ముఖ్ బయటకు వచ్చేస్తాడని రవితో గొడవ పడాలని అనుకున్నా ఛాన్స్ ఇవ్వలేదని చెప్పారు. ప్రియ బిగ్ బాస్ షోకు పనికిరాదని యానీ మాస్టర్ కన్నింగ్ అని ఉమాదేవి వెల్లడించారు.
గత వారం నామినేషన్ సమయంలో బూతులు మాట్లాడటం ఉమాదేవికి మైనస్ గా మారింది. బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్లకు వారం చొప్పున రెమ్యునరేషన్ ఇస్తారనే సంగతి తెలిసిందే. 1,60,000 రూపాయల పారితోషికం రెండు వారాలకు ఉమాదేవికి దక్కినట్టు తెలుస్తోంది. ఉమాదేవి ఎలిమినేట్ కావడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. లోబోతో ఉమాదేవి కలిసి ఎంటర్టైన్మెంట్ అందించినా స్వయం కృపరాదం వల్లే ఉమాదేవి ఎలిమినేట్ అయినట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కార్తీకదీపం సీరియల్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నా ఉమాదేవికి ప్లస్ కాలేదు. బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడిన బూతుల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు ఉమాదేవికి రాలేదని తెలుస్తోంది. సిరి, షణ్ముఖ్ ఫ్రెండ్స్ ఏమిటో తనకు అర్థం కాదని ఫ్రెండ్ షిప్ కోసమే ఆడటానికి వస్తే ఇంట్లో ఆడుకోవచ్చు కదా? అని ఉమాదేవి కామెంట్లు చేశారు. బయటికి వచ్చాక కూడా సిరి, షణ్ముఖ్ అలాగే ఉంటారా? అని ఉమాదేవి ప్రశ్నించారు.
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?