Abijeet: పెళ్లి, సినిమాలపై అప్డేట్ ఇచ్చిన అభిజిత్!

  • May 11, 2021 / 05:33 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా నిలిచిన అభిజీత్.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహిస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. తాజాగా లైవ్ లోకి వచ్చిన ఆయన కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. తన తల్లి కోవిడ్ బారిన పడిందని అభిజీత్ అన్నారు. భయపడినట్లే జరిగిందని.. తన తల్లి మంగళవారం నాడు టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చిందని.. మిగిలిన కుటుంబ సభ్యులకు నెగెటివ్ వచ్చిందని అన్నారు. తన తల్లికి సీటీ లెవెల్స్ బాగానే ఉన్నాయని.. త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఈ కోవిడ్ మానసిక ధైర్యానికి పరీక్ష పెడుతుందని.. వ్యాధి సోకిన వ్యక్తిని రూమ్ లో బంధించడం అనేది దారుణమని కానీ ఇంకేం చేయలేమని అన్నారు. ఇక ఇలాంటి సమయంలో అలిసిపోకుండా సేవలందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు సలాం కొట్టారు. తనకు తెలిసిన డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారని.. వాళ్లు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు పడుకుంటారో.. మళ్లీ ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదని అన్నారు. అనంతరం అభిజిత్ కి సినిమా అప్డేట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నానని.. ఈ సమయం వృధా కాకుండా స్పానిష్ భాష నేర్చుకుంటున్నట్లు చెప్పారు. అలానే స్క్రిప్ట్ లు వింటున్నానని.. ఇప్పుడే వాటి గురించి చెప్పలేనని అన్నారు. ఇక పెళ్లి ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు ఇప్పుడప్పుడే ఉండదులే అంటూ నవ్వుతూ తప్పించుకున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus