మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ‘బిగ్ బాస్’ విన్నర్..!

  • July 10, 2020 / 05:39 PM IST

మహేష్ బాబు హీరోగా ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురాం(బుజ్జి).. ‘సర్కారు వారి పాట’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇప్పటికే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది కానీ.. వైరస్ మహమ్మారి కారణంగా బాధితులు ఎక్కువ అవుతుండడంతో.. దసరా వరకూ షూటింగ్ స్టార్ట్ చెయ్యకూడదు అని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ అలాగే ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై మహేష్ కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో విలన్ గా కన్నడ స్టార్ హీరో సుదీప్ ను అనుకుంటున్నారు. అయితే మరో విలన్ పాత్రకు కూడా ఈ చిత్రంలో స్కోప్ ఉంటుందట.అందుకు ‘బిగ్ బాస్’ విన్నర్ ను తీసుకోబోతున్నట్టు వినికిడి. వివరాల్లోకి వెళితే.. ‘బిగ్ బాస్2’ విన్నర్ కౌశల్ మందాను.. ‘సర్కారు వారి పాట’ చిత్రంలో సెకండ్ విలన్ గా ఎంచుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

అందుకు గాను కౌశల్ ను స్క్రీనింగ్ కూడా చెయ్యబోతున్నారట. ఒకవేళ ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో కౌశల్ సెట్ అయితే అతన్ని ఫిక్స్ చేసేస్తారు. అందులోనూ కౌశల్ కూడా మహేష్ బాబు కు అత్యంత సన్నిహితుడు అన్న సంగతి తెలిసిందే. ‘బిగ్ బాస్2’ విన్నర్ గా కౌశల్ పేరు ప్రకటించగానే అతనికి అభినందనలు కూడా తెలిపాడు మహేష్ బాబు. గతంలో ‘రాజకుమారుడు’ చిత్రంలో కూడా కౌశల్.. మహేష్ ఫ్రెండ్ గా నటించాడు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus