Ashu Reddy: కాబోయే ప్రియుడు ఎలా ఉండాలో చెప్పేసిన అషు రెడ్డి!
February 24, 2023 / 07:00 PM IST
|Follow Us
సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత కొందరు సెలబ్రిటీలు గా మారిపోయారు. ఇలా సెలబ్రిటీలకు గుర్తింపు పొందిన వారిలో అషు రెడ్డి ఒకరు. కాస్త అటు ఇటుగా సమంత పోలికలు ఉండడంతో అందరూ ఈమెను జూనియర్ సమంత అంటూ పెద్ద ఎత్తున పొగడ్తలతో ముంచెత్తారు. ఇలా జూనియర్ సమంతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ తరచూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా ఈమెకు సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇక సెలబ్రిటీలను బోల్డ్ ఇంటర్వ్యూ చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే అషు రెడ్డి తనకు వీలు దొరికినప్పుడల్లా వెకేషన్ లకు వెళ్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఆగ్రా వెళ్లారని తెలుస్తోంది. ఈ విధంగా ఆగ్రా వెళ్లిన అషు రెడ్డి తాజ్ మహల్ ముందు ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు కాబోయే లవర్ ఎలా ఉండాలో కూడా తెలియజేశారు.ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈమె షాజహాన్ ను ఓ కోరిక కోరింది.ఈ సందర్భంగా ఈ ఫోటోలను అషు రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కట్టించారు.
అలాగే షాజహాన్ లా ప్రేమించే వ్యక్తి తనకు కావాలని కోరుకున్నారు. హే షాజహాన్ నీలాగే నన్ను ప్రేమించే వ్యక్తి లవర్ గా రావాలని ఆశీర్వదించండి అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. ఇక ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై నేటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేస్తూ వచ్చారు.