పాజిటివ్ రివ్యూలతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న ‘బిగ్ బాస్’ శ్వేతా వర్మ ‘ఏకమ్’ చిత్రం..!
October 30, 2021 / 03:15 PM IST
|Follow Us
అభిరామ్ వర్మ, తనికెళ్ళ భరణి,అదితి మైకేల్, కల్పిక గణేష్,దయానంద్ రెడ్డి, ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్వేతా వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఏకమ్’. బోయపాటి రఘు సమర్పణలో ‘ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ’, ‘సంస్క్తృతి ప్రొడక్షన్స్’, ‘డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్’ కలిసి నిర్మించిన చిత్రమిది. జోస్ ఫ్రాంక్లిన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వరుణ్ వంశీ దర్శకత్వం వహించాడు. నిన్న అంటే అక్టోబర్ 29న(శుక్రవారం నాడు) విడుదలైన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ లభించింది. విడుదల ముందు నుండీ ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. ముందుగానే ఈ చిత్రం ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్’ ను సొంతం చేసుకుంది.. దానికి తోడు ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి సంస్థలో ఈ చిత్రానికి 9.7/10 రేటింగ్ నమోదవ్వడం విశేషంగా చెప్పుకోవాలి.
ఇక సినిమా విషయానికి వస్తే .. ఓపెనింగ్‌లోనే దర్శకుడు ఇది పూర్తిగా 5 పాత్రల చుట్టూ తిరిగే కథ అని క్లారిటీ ఇచ్చేసాడు.దాంతో ‘ఏకమ్’ అనే టైటిల్ పెట్టినట్టు కూడా స్పష్టత వచ్చేసింది. టైటిల్ కార్డ్స్ పడ్డ విధానం బట్టి దర్శకుడి ప్రతిభ ఏంటన్నది స్పష్టమవుతుంది.
ఇక కథ విషయానికి వచ్చేస్తే…. ఆనంద్ (అభిరామ్ వర్మ ) తన చిన్నతనంలోనే కుటుంబాన్ని పెద్దయ్యాక ప్రేమించిన అమ్మాయిని, మంచి జాబ్ ను పోగోట్టుకుని ఈ ప్రపంచంలో దేనికోసమో అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటాడు. దేవుడు తనకి ఏమీ లేకుండా చేసేసాడు అంటూ భావించి దేవుడు(విష్ణువు) పై కోపం పెట్టుకుంటాడు. అక్కడితో ఆగకుండా అదే దేవుడిని స్మశానం లోకి తీసుకొనిపోయి అక్కడే నివసించడానికి రెడీ అవుతాడు. దివ్య(అదితి మైకేల్ ) తండ్రిని కోల్పోయిన అమ్మాయి. ఎప్పటికైనా ఓ కాఫీ షాప్ పెట్టి ఎదగాలని తన డ్రీం ను ఫుల్ ఫిల్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో డేవిడ్(దయానంద్ రెడ్డి విలన్) దివ్య కాఫీ షాప్ లో జాబ్ కావాలి అని వచ్చి ఆమెని కన్విన్స్ చేసి జాబ్ లో జాయిన్ అవుతాడు.ఇక నిత్య(కల్పిక గణేష్ ) ఆనంద్ ప్రేయసి… ఎలాగైనా ప్రియుడిని మార్చుకొని అతన్ని పెళ్ళి చేసుకోవాలని ఆశపడుతోంది. ఇక నిర్వాణ (బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ) తన ప్రేమించిన అబ్బాయికి కొన్ని అనుకోని సంఘటనల వల్ల దూరమవుతుంది.కానీ అనుకోకుండా నిర్వాణ, అభిరామ్ కలుసుకుంటారు? వాళ్ళు ఎందుకు కలుసుకున్నారు ఎలా కలుసుకున్నారు? మిగిలిన వాళ్ళ కారణంగా వీళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది తెరపై చూడాల్సిన కథ.
ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయమే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా బోర్ కొట్టించదు.అలాగే దర్శకుడు కథలోకి తీసుకెళ్ళిన విధానం కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో ఆనంద్ వర్మ,శ్వేతా వర్మ ల పాత్రలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.వాళ్ళ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. శ్వేతా వర్మ బిగ్ బాస్ అభిమానులు.. ఆమె పాత్రని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఆమెనే కాబట్టి.. వాళ్ళని నిరాశపరచదు. ఇక తనికెళ్ళ భరణి విష్ణుమూర్తి భక్తుడి పాత్రలో ఒదిగిపోయారు.కల్పిక పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఆమె పాత్ర చాలా కీలకం. అలాగే ఉన్నంతలో ఆమె చాలా బాగా నటించింది. దయానంద్ రెడ్డి… ఎన్నో అవార్డులు అందుకున్న నటుడు కాబట్టి ఇక్కడ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని ఎంతో ఈజ్ తో చేసాడు.ఇతని పాత్రకి కూడా మంచి మార్కులు పడతాయి. సెకండ్ హాఫ్ లో వచ్ఛే విష్ణువు సాంగ్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి. సంగీత దర్శకుడు జోస్ ఫ్రాంక్లిన్ కు ఇక్కడ ఫుల్ మర్క్స్ వేసెయ్యొచ్చు. దర్శకుడు వరుణ్ వంశీ సంభాషణలు కూడా ఆకట్టుకునేలా అదేవిధంగా ఆలోచింపచేసేలా ఉన్నాయి. ప్రొడక్షన్ విలువలు కూడా బాగున్నాయి. నిర్మాతకి సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉందనేది ఈ చిత్రంతో చెప్పకనే చెప్పాడు.మరీ ముఖ్యంగా ఇక్బాల్ అజ్మీ సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. అతని పనితనం అందరినీ మెప్పిస్తుంది. ప్రతీ ఫ్రేమ్ అంత బాగా రావడానికి సినిమాటోగ్రాఫర్ కృషి చాలా ఉందనిపిస్తుంది.
మొత్తంగా మంచి కథాబలం ఉన్న చిత్రమిది.దానికి క్యాస్టింగ్,మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైలోగ్స్ వంటివి బాగా ప్లస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో నిడివి తక్కువ ఉండటం,అలాగే సడెన్ క్లైమాక్స్ వంటివి మైనస్ పాయింట్లుగా చెప్పొచ్చు.అయితే ఓ మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ ను అయితే ‘ఏకమ్’ కచ్చితంగా ఇస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి..వీకెండ్ కు థియేటర్లలో చూడదగ్గ సినిమా ఇది అక్కడ మిస్ అయితే ఓటిటిల్లో అయినా నిస్సందేహంగా ఓసారి చూడాల్సిన సినిమా..!
మొత్తంగా మంచి కథాబలం ఉన్న చిత్రమిది.దానికి క్యాస్టింగ్,మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైలోగ్స్ వంటివి బాగా ప్లస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో నిడివి తక్కువ ఉండటం,అలాగే సడెన్ క్లైమాక్స్ వంటివి మైనస్ పాయింట్లుగా చెప్పొచ్చు.అయితే ఓ మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ ను అయితే ‘ఏకమ్’ కచ్చితంగా ఇస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి..వీకెండ్ కు థియేటర్లలో చూడదగ్గ సినిమా ఇది అక్కడ మిస్ అయితే ఓటిటిల్లో అయినా నిస్సందేహంగా ఓసారి చూడాల్సిన సినిమా..!