Chiranjeevi: చిరంజీవితో ‘బింబిసార’ డైరక్టర్‌.. నిజమేనా? అవుతుందా?

  • April 7, 2023 / 07:57 PM IST

ఓ సినిమా హిట్‌ అవ్వగానే.. వెంటనే ఆ హీరోకు సినిమా ఛాన్స్‌లు వచ్చేస్తాయి. హీరోయిన్‌ సంగతి సరేసరి.. ఏ సినిమా ఎప్పుడో కూడా తెలియనట్లు డైరీ నిండిపోతుంది. అయితే దర్శకుల పరిస్థితీ ఇలానే ఉంటుంది. అందులోనూ కొత్త దర్శకుల పరిస్థితి అంటే కష్టమే అని చెప్పాలి. తాజాగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న దర్శకుల్లో మల్లిడి వశిష్ట ఒకరు. ‘బింబిసార’ సినిమాతో భారీ విజయం అందుకున్న ఆయన.. ఆ సినిమా రెండో పార్టు పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఎక్కడా అంతగా సందడి లేదు.

ఈలోపు అతను వేరే హీరోలకు కథలు చెబుతున్నారని టాక్‌ నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల వశిష్ట చిరంజీవిని కలిశారు అని అంటున్నారు. అంతేకాదు ఓ కథ లైన్‌ చెప్పి ఓకే కూడా చేయించుకున్నారని అని కూడా అంటున్నారు. పాయింట్‌ చిరంజీవికి బాగా నచ్చిందని.. పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోమని, మనం ఈ సినిమా చేస్తున్నామని అన్నారని అంటున్నారు. అయితే పాయింట్‌ ఏంటి, ఎలా ఉండబోతోంది అనేది తెలియడం లేదు.

‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత చిరంజీవి (Chiranjeevi) పాత సినిమా స్టార్ట్‌ చేశారు కానీ.. కొత్త సినిమా ఏదీ సైన్‌ చేయలేదు. గతంలో ఓకే అనుకున్న వెంకీ కుడుమల సినిమా ఇప్పట్లో లేదు అని అంటున్నారు. అయితే ఇప్పుడు మల్లిడి వశిష్ట సినిమా ఓకే అయ్యింది అని టాక్‌. వరుసగాచిన్న సినిమాలు తీస్తూ మంచి హిట్స్ కొడుతున్న బ్యానర్‌పై ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా విషయంలో క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు.

అయితే, పాయింట్‌ ఓకే అవ్వగానే చిరంజీవి దగ్గర సినిమా ముందుకు వెళ్లదు అనే విషయం మనకు తెలిసిందే. కథ విషయంలో ఆయన పూర్తి సంతృప్తితో ఉంటేనే మొదలవుతుంది. వెంకీ కుడుముల – డీవీవీ దానయ్య సినిమా అలానే అనుకుని ఆగిపోయింది. మరి వశిష్ట ఇప్పుడు కథను సిద్ధం చేసి ఎలా ఒప్పిస్తారో చూడాలి. మరోవైపు చిరంజీవి – పూరి సినిమా కూడా డిస్కషన్స్‌ స్టేజీలో ఉండి అంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus