Bindu, Mitraaw: మిత్రా పై కౌంటర్ ఎటాక్ చేసిన బిందు..! అందుకే ఇలా చేసింది..!
May 3, 2022 / 10:14 AM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం నామినేషన్స్ ఒక రేంజ్ లో జరిగాయి. ముఖ్యంగా శివ అషూపట్ల మాట్లాడిన మాటలని తప్పుబడుతూ నామినేట్ చేశారు అందరూ. బిందుమాధవి సైతం శివని నామినేట్ చేసింది. ఇక మిత్రాకి, బిందుకి జరిగిన ఆర్గ్యూమెంట్స్ నామినేషన్స్ లోనే హైలెట్ అయ్యాయి. బిందుమాధవి మిత్రాని నామినేట్ చేస్తూ తన చేతికి ఛేదులడ్డూ ఇచ్చింది. దీంతో తన చేయి తనకి తగిలిందని, డోంట్ గెట్ ఫిజికల్, బిగ్ బాస్ ఫిజికల్ అవుతోంది బిగ్ బాస్ అంటూ మిత్రా స్టైల్లో రెచ్చిపోయింది.
కావాలనే వాంటెండ్ గా మిత్రా ఎమోషన్ ని ఇమిటేట్ చేసింది. మిత్రా లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఎలా ప్రవర్తించిందో అంతకంటే ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తూ బిందు మిత్రాని ఆడుకుంది. నిజానికి నామినేషన్స్ అప్పుడు అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, బిందు మాధవి మిత్రాలాగా బిహేవ్ చేస్తూ మిత్రాని నామినేట్ చేసింది. ఆ తర్వాత శివని కూడా నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వట్లేదని, నువ్వు అన్నమాటలు చాలా తప్పు అంటూ క్లారిటీగా చెప్పేసింది.
ఇక ఆ తర్వాత మిత్రా బిందుని నామినేట్ చేస్తూ పాయింట్స్ మాట్లాడుంటే, అస్సలు మిత్రాని మాట్లాడనివ్వలేదు. అమ్మో నాకు భయమేస్తోంది అంటూ, యాష్ ట్యాగ్ మస్తీ అంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. బిందుమాధవి మిత్రా నామినేట్ చేస్తుంటే రెచ్చిపోయి మరీ డ్రామా చేసింది. హౌస్ మేట్స్ అందరూ బిందు ప్రవర్తనకి షాక్ అయ్యారు. లాస్ట్ వీక్ మిత్రా ఎలాగైతే రెచ్చిపోయి బిహేవ్ చేసిందో దానికి కౌంటర్ ఎటాక్ చేసింది బిందు.
ముళ్లుని ముళ్లుతోనే తీయాలని మాకు చెప్పారని, అందుకే నేను కూడా ఇలాగే మాట్లాడుతున్నా అంటూ కావాలనే అలా చేసింది. ఒకవైపు మిత్రా మాట్లాడుతుంటే నామినేషన్స్ లో గార్డెన్ చుట్టూ పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తూ తిరుగుతూ మిత్రా పాయింట్ ని అస్సలు మాట్లాడనివ్వలేదు. దీంతో మిత్రా చాలాసేపు సైలెంట్ గా ఉండిపోయింది. అంతేకాదు, హౌస్ మేట్స్ కి సైతం బిందు ప్రవర్తన ఇరిటేషన్ తెప్పించింది. మద్యమద్యలో మిత్రాని టీజ్ చేస్తూ రెచ్చిపోయింది బిందు.
ఈవారం నామినేషన్స్ లో బిందుమాధవి తనదైన స్టైల్లో రెచ్చిపోయి మరీ డ్రామా క్రియేట్ చేసింది. హైలెట్ గా నిలిచింది. కావాలనే మిత్రాకి బుద్ది చెప్పాలనే ఇలా చేశానని ఆ తర్వాత మాట్లాడింది బిందు. లాస్ట్ వీక్ , అలాగే వీకెండ్ మేము ఇలా అనుభవించామని ఈ పైయిన్ తనకి కూడా తెలియాలని ఇలా చేశానని చెప్పింది. అదీమేటర్.