ఘనంగా స్టార్ హీరోయిన్ బిపాసా బసు కూతురు దేవి బసు అన్నప్రాసన వేడుక.. వీడియో వైరల్!

  • June 11, 2023 / 04:30 PM IST

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ బిపాసా బసు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే అని చెప్పాలి. మహేష్ బాబు హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో కౌబాయ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ‘టక్కరి దొంగ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో తెలుగులో ఈమెకు ఆఫర్లు పెద్దగా రాలేదు.పైగా ఈమె పారితోషికం కూడా ఆ టైంలో బాగా ఎక్కువగా ఉండేది. అందుకే టాలీవుడ్ దర్శక నిర్మాతలు ధైర్యం చేసి ఈమెతో సినిమాలు చేయలేకపోయారు.తర్వాత బాలీవుడ్లో కూడా ఈమెకి డిమాండ్ తగ్గింది.

దీంతో 2016 లో కరణ్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. 6 ఏళ్ల తర్వాత అంటే గతేడాది నవంబర్ 12 న వీళ్ళు తల్లిదండ్రులు అయ్యారు. పండంటి ఆడపిల్లకి బిపాసా జన్మనిచ్చింది. వీరి పాపకి దేవి బసు సింగ్ గ్రోవర్ అని నామకరణం చేశారు. తాజాగా వీరి పాపకి అన్నప్రాసన వేడుకను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని ఈ దంపతులు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బిపాసా, కరణ్.. ల కుటుంబ సభ్యులు.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ వంటి వారు ఈ వేడుకలో పాల్గొన్నారు.మరోపక్క వీరు అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు.

బిపాస బసు ఇప్పుడు కొంచెం బరువు పెరగడంతో సినిమాలకి బ్రేక్ ఇచ్చారు. కరణ్ సింగ్ గ్రోవర్ అయితే హృతిక్ రోషన్ -దీపికా పదుకోనె కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఫైటర్’ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక బిపాసా బసు కూతురు అన్నప్రాసన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus